iDreamPost
android-app
ios-app

పట్టపగలే కారు చీకట్లు.. HYDలో దంచికొడుతున్న వాన

Rains in Hyderabad: హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొడుతున్నది. మధ్యాహ్నం వరకు ఎండకాయగా ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని కుండపోత వాన కురుస్తున్నది.

Rains in Hyderabad: హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొడుతున్నది. మధ్యాహ్నం వరకు ఎండకాయగా ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని కుండపోత వాన కురుస్తున్నది.

పట్టపగలే కారు చీకట్లు.. HYDలో దంచికొడుతున్న వాన

తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో తగ్గేలా లేవు. వరుణుడు కుండపోత వర్షాలతో విరుచుకుపడుతున్నాడు. హైదరాబాద్ లో ఉదయం నుంచి ఎండకాయగా మధ్యాహ్నం కల్లా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడింది. ఆకాశమంతా మేఘావృతమైంది. నల్లని మేఘాలు దట్టంగా అలుముకుని పట్టపగలే కారు చీకట్లు కమ్ముకున్నాయి. నగరంలో భారీ వర్షం కురుస్తున్నది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వాన దంచికొడుతుంది. భారీ వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి.

హైదరాబాద్ లో గత కొద్ది రోజులుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడుతున్నది. క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా ఆవరించి అప్పటికప్పుడే భారీ వర్షం కురుస్తున్నది. నగరంలో కురుస్తున్న జోరు వానతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే తప్పా బయటకు రావొద్దని సూచిస్తున్నారు. కాగా ద్రోణీ ప్రభావంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.