TGSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా..

Good News for Travelers: తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అప్పటి నుంచి బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ మొదలైంది. తాజాగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Good News for Travelers: తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అప్పటి నుంచి బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ మొదలైంది. తాజాగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది తెలంగాణ సర్కార్.  ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు రైతు, మహిళా సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తుంది. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఏర్పాటు చేసింది. ఉచిత ప్రయాణ సదుపాయం తర్వాత రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.రాబోయే రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని తెలంగాణ సర్కార్ చెప్పింది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన తర్వాత ప్రయాణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లో సైతం బస్టాండ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది.. అందుకు తగ్గట్టు బస్సుల లేకపోవడంతో ఇక్కట్లపాలవుతున్నారు. దీనిపై పలు విమర్శలు రావడంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. త్వరలో కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.తాజాగా ప్రయాణికులకు మరో శుభవార్త చెపింది తెలంగాణ సర్కార్. ఇటీవల పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రికల్ కార్లు, బైకులు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగానే కరీంనగర్ బస్ డిపోకు 70 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించబడ్డాయి.

బస్సులు కరీంనగర్ టు జేబీఎస్, కరీంనగర్ టు గోదావరి ఖని, కరీంనగర్ టు మంథని, కరీంనగర్ టు కామారెడ్డి, జిగిత్యాల వరకు నాన్ స్టాప్ గా నడవనున్నాయి. ఈ ఎలక్ట్రికల్ బస్సుకు ఒక్కసారి చార్జింగ్ పెడితో 350 నుంచి 400 కిలో మీటర్లు అవలీలగా ప్రయాణం చేయవొచ్చు అంటున్నారు. తొలివిడతగా 33 సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులు కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్లు అద్దె ప్రాతిపదికన జేసీసీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ చే నడపబడాయి.. వీటి పర్యవేక్షణ, ఆపరేషన్ మొత్తం ఆర్టీసీ చూసుకుంటుందని డిపో రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ బస్సులో రెండు సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్జిస్టర్, పూర్తిగా ఇవి పవర్ విండోతో నడుస్తుంది. ఈ బస్సుల్లో మౌలిక వసతులు ఏర్పటు పూర్తయిన తర్వాత లగ్జరీ బస్సులు రోడ్డు ఎక్కనున్నాయి. ఇది లిమిటెడ్ స్పీడ్ తో నడుస్తుందని మేనేజర్ తెలిపారు.

Show comments