iDreamPost
android-app
ios-app

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం..భయందోళనలో ప్రజలు

  • Published Aug 23, 2024 | 5:48 PM Updated Updated Aug 23, 2024 | 5:55 PM

Secunderabad Paradise Hotel Fire Accident: తాజాగా సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీనితో హోటల్ సిబ్బంది, కస్టమర్లు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Secunderabad Paradise Hotel Fire Accident: తాజాగా సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీనితో హోటల్ సిబ్బంది, కస్టమర్లు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 23, 2024 | 5:48 PMUpdated Aug 23, 2024 | 5:55 PM
సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం..భయందోళనలో ప్రజలు

ఈ మధ్య తరచూ అగ్నిప్రమాదాలు , యాక్సిడెంట్స్ కు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. దీనితో ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. ఎదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి వార్తలు రోజులో రెండు మూడు అయినా వింటూనే ఉన్నాము. ఈ క్రమంలో తాజాగా సికింద్రాబాద్ లోని ఓ హోటల్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఉన్నట్లుండి హోటల్ లో దట్టమైన పొగతో మంటలు చెలరేగాయి. ఆ ఘటనను సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో తాజాగా అగ్నిప్రమాదం జరిగింది. దీనితో అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే హోటల్ లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సరైన సమయానికి అక్కడికి చేరుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకముందే.. అందరు సేఫ్ గా బయటపడ్డారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.. ఆ హోటల్ లోని జెనరేటర్ హీట్ అయ్యి.. ఆ జెనరేటర్ ఉన్న గదిలోనే.. పేపర్స్ లాంటి ఇతర స్క్రాప్ అంతా ఉండడంతో మంటలు వ్యాపించి.. ఈ అగ్నిప్రమాదం జరిగిందని ఫైర్ సేఫ్టీ అధికారి షబ్బీర్ తెలియజేశారు. జరిగింది చిన్న ప్రమాదమే కాబట్టి.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అవ్వడంతో.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పుకొచ్చారు.

ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా ఇలాంటి విషయాలలో హోటల్ సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. సరైన సమయంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు కాబట్టి ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ఈ ఘటనలో ఇంకా ఎలాంటి వార్తలు వినాల్సి వచ్చేదో అందరికి తెలియనిది కాదు. ఇక మీదటైనా హోటల్స్ , మాల్స్ లో యాజమాన్యం జాగ్రత్త పడి.. ప్రజల సేఫ్టీ పై ద్రుష్టి పెట్టాలని అంతా భావిస్తున్నారు. మరి సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో జరిగిన ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.