Revanth Reddy-Cheonggyecheon River, Musi Riverfront Development: ఇక మూసీ ప్రక్షాళన పక్కా.. ఆ నదే ఆదర్శం..

ఇక మూసీ ప్రక్షాళన పక్కా.. ఆ నదే ఆదర్శం..

CM Revanth Reddy-Cheonggyecheon River, Musi: మూసీ నది ప్రక్షాళనకు రెడీ అయిన రేవంత్ సర్కార్ ఇందుకోసం ఆ నదిని పరిశీలించనుంది. ఆ వివరాలు..

CM Revanth Reddy-Cheonggyecheon River, Musi: మూసీ నది ప్రక్షాళనకు రెడీ అయిన రేవంత్ సర్కార్ ఇందుకోసం ఆ నదిని పరిశీలించనుంది. ఆ వివరాలు..

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మూసీ నది పేరు వినపడితే.. ఇప్పుడు ముక్కు మూసుకుంటాం.. కానీ ఒకప్పుడు ఈ నది భాగ్యనగర వాసుల దూప తీర్చింది.. నల్లగొండ జిల్లాలో కొన్ని వందల ఎకరాలను తడిపి.. పంటలకు ప్రాణం పోసింది. ఒకప్పుడు జీవనదిగా ఉన్న మూసి.. కాలక్రమేణా తన ప్రభవాన్ని కోల్పోసాగింది. హైదరాబాద్ నగరంలో చేసిన అభివృద్ధి మూసీని మురికి కూపంగా మార్చింది. నగరంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, డ్రైనేజీ వాటర్ కలిసి మూసీని మురికి నదిగా మార్చాయి. ఆ పరిసరాల్లో తిరగాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. అంతలా నది నాశనం అయ్యింది. అయితే మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ఓ దేశంలో ఇలానే ప్రక్షాళన చేసిన నదిని ఆదర్శంగా తీసుకున్నారట. ఆ వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనకు సిద్ధమైన విషయం తెలిసిందే. మూసీ ప్రక్షాళన కోసం ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయిచింది. మూసీ నదికి ఇరువైపులా అందమైన పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించి టూరిస్ట్‌గా హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మూసీ నది ప్రక్షాళనకు సౌత్ కొరియా రాజధాని సియోల్‌ నగరం గుండా వెళ్లే అందమైన చియోంగీచియాన్‌ నదిని ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు.

ఒకప్పుడు మూసీ మాదిరిగా మురికి కూపంగా ఉన్న ఆ నదిని.. అక్కడి ప్రభుత్వం పునరుద్ధరించి అందంగా మార్చింది.  ఈ నదిని 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రివర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి ఏటా దాదాపు 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. దీంతో సియోల్‌ నగరం ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారింది.

ప్రస్తుతం దక్షిణ కోరియా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి , ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, ఇతర ప్రతినిధి బృందం.. సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చియోంగీచియాన్‌ నదీ పరిసరాలను పరిశీలించారు. ఒకప్పుడు మురికి కూపంగా ఉన్న సియోల్‌లోని చియోంగీచియాన్ నదిని ప్రక్షాళన చేసి ఇప్పుడు ప్రపంచస్థాయి వాటర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నది సుందరీకరణ జరిగిన విధానం గురించి అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్.. మూసీ నదిని కూడా ఇలానే బాగు చేయాలిని భావిస్తున్నారు. దాంతో మూసీ ప్రక్షాళన పక్కా అంటున్నారు.

Show comments