CM రేవంత్- ఫాక్స్ కాన్ ఛైర్మన్ భేటీ.. హైదరాబాద్ ఫోర్త్ సిటీలో పెట్టుబడులు!

CM Revanth Reddy- Foxconn Eyes To Invest In Hyderabad Fourth City: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని బృందం భేటీ అయ్యింది. హైదరాబాద్ ని త్వరలోనే సందర్శిస్తాను అని ఫాక్స్ కాన్ ఛైర్మన్ రేవంత్ రెడ్డికి తెలియజేశారు.

CM Revanth Reddy- Foxconn Eyes To Invest In Hyderabad Fourth City: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని బృందం భేటీ అయ్యింది. హైదరాబాద్ ని త్వరలోనే సందర్శిస్తాను అని ఫాక్స్ కాన్ ఛైర్మన్ రేవంత్ రెడ్డికి తెలియజేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ బృందం సీఎం రేవంత్ తో భేటీ అయ్యింది. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను, హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తీరును సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అలాగే ఇన్నాళ్లు మూడు సిటీలుగా ఉన్న హైదరాబాద్ ను నాలుగో నగరానికి విస్తరిస్తున్న అంశాన్ని కూడా యాంగ్ లియూకి సీఎం వివరించారు. అలాగే హైదరాబాద్ నగరం చరిత్ర, ఇక్కడ పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న సానుకూల వాతావరణం గురించి కూడా ముఖ్యంమంత్రి ఫాక్స్ కాన్ ప్రతినిధులకు వివరించారు.

ఫోర్త్ సిటీ:

హైదరాబాద్ లో అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మరో నగరాన్ని రూపొందిస్తున్నాం అని తెలియజేశారు. ఈ ఫోర్త్ సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయబోతున్న విషయాన్ని స్పష్టం చేశారు. వైద్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్, క్రీడలు, నైపుణ్యం ఇలా అన్ని అంశాల్లో ఫోర్త్ సిటీని డెవలప్ చేస్తామన్నారు. నవ తరం యువతకు కావాల్సిన నైపుణ్యాన్ని అందించేందుకు వీలుగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్న విషయాన్ని తెలియజేశారు. స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్ గా ఆనంద మహీంద్రాను, వైస్ ఛైర్మన్ గా శ్రీనివాస రాజును నియమించామని తెలిపారు. అలాగే హైదరాబాద్ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం, రీజననల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వంటి సదుపాయాల గురించి వివరించారు.

ఫాక్స్ కాన్ పెట్టుబడులు:

సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ హర్షం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్లలో మాత్రమే కాకుండా.. ప్రతి రంగంలో విస్తరించగల సత్తా హైదరాబాద్ కు ఉంది అంటూ యాంగ్ లియూ ప్రశంసలు కురిపించారు. అతి త్వరలోనే తాను హైదరాబాద్ ను సందర్శిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అంతకంటే ముందు చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, ఫాక్స్ కాన్ ఇండియా ప్రతినిధి వీ లీతో కూడిన బృందం హైదరాబాద్ ను సందర్శిస్తారని వెల్లడించారు. ఫోర్త్ సిటీ విస్తరణలో ముఖ్యమంత్రి ఐడియాలజీ, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఫోర్త్ సిటీ విస్తరణలో సీఎం రేవంత్ విజన్ అద్భుతం అంటూ కొనియాడారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్ కాన్ సంస్థ పరిశ్రమల స్థాపన కోసం అవసరమైన మద్దతు, అనుమతులు ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Show comments