iDreamPost
android-app
ios-app

జహీరాబాద్ నిమ్జ్‌ని స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా అభివృద్ధి చేయనున్న కేంద్రం

  • Published Aug 30, 2024 | 4:39 PM Updated Updated Aug 30, 2024 | 4:39 PM

Another Industrial Smart City In Hyderabad: హైదరాబాద్ లో మరో కొత్త సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశంలోని 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను నిర్మించనున్న కేంద్రం వాటిలో తెలంగాణలోని ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఈ ఏరియా కనుక డెవలప్ అయితే ఆ ప్రాంతంలో స్థలాల మీద పెట్టుబడులు పెట్టిన వారికి కాసుల కనక వర్షం కురవడం పక్కా అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

Another Industrial Smart City In Hyderabad: హైదరాబాద్ లో మరో కొత్త సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశంలోని 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను నిర్మించనున్న కేంద్రం వాటిలో తెలంగాణలోని ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఈ ఏరియా కనుక డెవలప్ అయితే ఆ ప్రాంతంలో స్థలాల మీద పెట్టుబడులు పెట్టిన వారికి కాసుల కనక వర్షం కురవడం పక్కా అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

జహీరాబాద్ నిమ్జ్‌ని స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా అభివృద్ధి చేయనున్న కేంద్రం

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద దేశంలో 12 పారిశ్రామిక నగరాలను నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 28,602 కోట్ల రూపాయల పెట్టుబడిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ పది రాష్ట్రాల వరకూ విస్తరించనుంది. ఇందులో 6 రాష్ట్రాల్లో ప్రధాన కారిడార్స్ ని నిర్మించాలని కేంద్రం యోచనలో ఉంది. ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, యూపీ, బీహార్, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో జహీరాబాద్ ని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా కేంద్రం ప్రకటించింది. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో 2,361 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుని రూపొందించనున్నారు.

ఈ క్రమంలో జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతం వివిధ రంగాలకు డైనమిక్ హబ్ గా ఉద్భవించనుంది. హైదరాబాద్ కే కాకుండా శంషాబాద్, తుక్కుగూడ, మహేశ్వరం వంటి పొరుగు ప్రాంతాలకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కల్పించనుంది. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందడం అంటే లోకల్ సక్సెస్ కంటే కూడా ఎక్కువే. ఇది జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక మ్యాప్ లో తెలంగాణను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచే వ్యూహాత్మక చర్య. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ రంగాలపై దృష్టి సారించనున్నారు. దీంతో 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అంచనా వేస్తున్నారు. 10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనుంది. దీంతో తెలంగాణ ఆర్థిక వృద్ధిని గణనీయంగా పెరగనుంది. 

జహీరాబాద్ లోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో 17 గ్రామాల్లో హైదరాబాద్-నాగ్ పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ రానుంది. దీంతో భవిష్యత్తులో జహీరాబాద్ లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ప్రస్తుతం ఈ ఏరియాలో గజం స్థలం రూ. 11 వేల నుంచి ఉన్నాయి. ఒక 22 లక్షలు పెట్టుబడి పెడితే 200 గజాల స్థలం వస్తుంది. చదరపు అడుగుల్లో చూసుకుంటే యావరేజ్ గా జహీరాబాద్ లో స్థలాల ధరలు రూ. 1200 పడుతుంది. ఈ ఏరియాలో ప్రాజెక్టు డెవలప్ అయితే కనుక చదరపు అడుగు 5 వేల రూపాయలు అయినా గానీ బోలెడంత లాభం ఉంటుంది. ఇండస్ట్రీలు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. దీంతో ఇళ్ళు కొనేందుకు ఉద్యోగులు ముందుకొస్తారు. ఆ సమయంలో డిమాండ్ పెరిగిపోయి రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు 1200 పెట్టి కొన్న స్థలం విలువ చదరపు అడుగు 5 వేలు అయినా గానీ లక్షల్లో లాభం వస్తుంది. ఇప్పుడు గజం 11 వేలు అయితే కొన్నాళ్ళకి 30 వేలు, 40 వేలు, 50 వేలు ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు కొనాలన్నా కొనలేని పరిస్థితి. అందుకే తక్కువ ధరకు వస్తున్నప్పుడే కొనేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.