90% పెరిగిన ఇళ్ల ధరలు.. దేశ రియల్ ఎస్టేట్‌లో టాప్‌లో హైదరాబాద్, బెంగళూరు

Best Investment Areas For Good Profits: హైదరాబాద్ లో గానీ నగర శివారు ప్రాంతాల్లో గానీ స్థలాలు కొనాలని అనుకునేవారు ఎలాంటి ప్రాంతాలను ఎంచుకోవాలి అనే దానికి ఈ నివేదికలే సమాధానం. ఈ నివేదికల ప్రకారం ఇలాంటి ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు తిరుగుండదు.

Best Investment Areas For Good Profits: హైదరాబాద్ లో గానీ నగర శివారు ప్రాంతాల్లో గానీ స్థలాలు కొనాలని అనుకునేవారు ఎలాంటి ప్రాంతాలను ఎంచుకోవాలి అనే దానికి ఈ నివేదికలే సమాధానం. ఈ నివేదికల ప్రకారం ఇలాంటి ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు తిరుగుండదు.

దేశంలోని ప్రధాన ఐటీ హబ్స్ గా ఉన్న బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ సిటీల్లో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ఐటీ సర్వీసులు, ప్రొఫెషనల్స్ కోసం డిమాండ్ పెరిగిపోతుండటం.. ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ తర్వాత కొత్త ఇళ్ల కోసం డిమాండ్ అనేది బాగా పెరిగిపోయింది. దీంతో ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. హైదరాబాద్ కోకాపేట పరిస్థితి కూడా ఇలానే ఉంది. వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్ సహా కమర్షియల్, రెసిడెన్షియల్ హబ్ అనేది ఇప్పుడు తెలంగాణలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఏరియాల్లో ఒకటి. అనరాక్ రీసెర్చ్ ప్రకారం 2019 నుంచి యావరేజ్ హోమ్ ధరలు 89 శాతం పెరిగాయి. ఈ పీరియడ్ లో ఈ ప్రాంతం 12,920 కొత్త యూనిట్ల సరఫరాను చూసింది.

2019లో రూ. 4,750 గా ఉన్న చదరపు అడుగు విలువ 2024 మొదటి క్వార్టర్ లో రూ. 9 వేలకు పెరిగింది. అల్ట్రా లగ్జరీ కేటగిరీలో 2.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కొత్త ఇళ్ల ప్రారంభాలు 52 శాతం ఉండగా.. మిడ్, ప్రీమియం సెగ్మెంట్ ఇళ్ల ప్రారంభాలు 30 శాతంగా ఉన్నాయి. మిగతా 18 శాతం లగ్జరీ కేటగిరీలో కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల మధ్య ఉన్న ఇళ్లు ఉన్నాయి. 2019 నుంచి 2024 మొదటి క్వార్టర్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 64 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలను బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఐటీ హబ్స్ ఉన్న చోట ఇళ్ల డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ప్రస్తుతం ఐటీ హబ్స్ ఉన్న ఏరియాల్లో స్థలాలు గానీ, ఇళ్ళు గానీ కొనాలంటే కొనలేని పరిస్థితి కాబట్టి ఐటీ హబ్స్ వచ్చే ఏరియాలపై ఫోకస్ పెడితే భవిష్యత్తులో ఊహించని లాభాలను పొందవచ్చు.

వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో 2019లో సగటున చదరపు అడుగు రూ. 4,750 ఉంటే అది ఇప్పుడు రూ. 9 వేలకు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. ఐదేళ్ల క్రితం గజం రూ. 42 వేలు ఉంటే ఇప్పుడు 81 వేల రూపాయలకు పెరిగింది. ఒక 100 గజాల మీద ఐదేళ్ల క్రితం 40 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు 80 లక్షలు పైనే వచ్చినట్టు. అంటే 40 లక్షల పెట్టుబడికి 40 లక్షలు లాభం వచ్చినట్టు. అంటే ఏడాదికి 8 లక్షలు లాభం వచ్చినట్టే. కాబట్టి హైదరాబాద్ లో గానీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో గానీ ఐటీ హబ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఏరియాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టడం అనేది ఉత్తమమైన ఛాయిస్ అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

Show comments