iDreamPost
android-app
ios-app

పెంపుడు కుక్కలు ఉన్నవారు వెంటనే ఈ పని చేయండి.. GHMC కమిషనర్‌ కీలక ప్రకటన

  • Published Aug 18, 2024 | 12:13 PM Updated Updated Aug 18, 2024 | 12:13 PM

Pet Dogs: మీకు పెంపుడు కుక్కలు ఉన్నాయా? అయితే మీకు ఓ అలర్ట్. పెంపుడు కుక్కల యజమానులకు జీహెచ్ ఎంసీ కీలక సూచన చేసింది. వెంటనే ఈ పని చేయండి.

Pet Dogs: మీకు పెంపుడు కుక్కలు ఉన్నాయా? అయితే మీకు ఓ అలర్ట్. పెంపుడు కుక్కల యజమానులకు జీహెచ్ ఎంసీ కీలక సూచన చేసింది. వెంటనే ఈ పని చేయండి.

పెంపుడు కుక్కలు ఉన్నవారు వెంటనే ఈ పని చేయండి.. GHMC కమిషనర్‌ కీలక ప్రకటన

పెంపుడు జంతువులను పెంచుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. పిల్లులు, కుక్కలను తెచ్చుకుని కుటుంబంలో ఓ వ్యక్తిలాగా పెంచుకుంటుంటారు. ఇక విశ్వాసానికి మారుపేరైన కుక్కలను పేద, ధనిక అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు పెంచుకుంటున్నారు జంతు ప్రేమికులు. పెంపుడు జంతువులకు ఆహారాన్ని అందిస్తూ.. వాటి ఆరోగ్యాన్ని చూస్తూ ప్రేమగా చూసుకుంటుంటారు. మరి మీకు కూడా పెంపుడు కుక్కలు ఉన్నాయా? కుక్కలను ఇళ్లలో పెంచుకుంటున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్ పెట్ డాగ్స్ ఓనర్స్ కు కీలక పిలుపునిచ్చింది. వెంటనే ఈ పని చేయండి.

ఇటీవల హైదాబాద్ నగరంలో కుక్కల దాడులు ఎక్కువైపోయిన విషయం తెలిసిందే. వీధుల్లో కుక్కలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పిల్లలు, పెద్దవాళ్లపై విరుచుకుపడుతూ గాయపరుస్తున్నాయి. బాటసారులు, యజమానులు, వారి కుటుంబసభ్యులపై పెంపుడు శునకాలు దాడి చేస్తున్నాయి. కుక్కల దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుక్కల దాడుల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీహెచ్ ఎంసీ అప్రమత్తమైంది. నగరంలోని అన్ని పెంపుడు కుక్కల వివరాలను సంబంధిత యజమానులు జీహెచ్‌ఎంసీ వద్ద నమోదు చేయించాలని కమిషనర్‌ ఆమ్రపాలి పిలుపునిచ్చారు.

జీహెచ్ ఎంసీ సూచనల మేరకు పెట్ డాగ్ ఓనర్స్ తమ పెంపుడు కుక్కల వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ‘మైజీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ యాప్‌లో ఉచితంగా అందుబాటులో ఉండనున్నట్లు ఆమ్రపాలి తెలిపారు. పెంపుడు కుక్కలకు సమయానికి టీకాలు వేయించాలని, మూగజీవుల సంరక్షణ చట్టాలు, నిబంధనల గురించి యజమానుల ఫోన్‌ నంబర్లకు సమాచారం అందిస్తుంటామని తెలిపారు. పూర్తి వివరాలకు జోన్ల వారీగా.. ఎల్బీనగర్.. అధికారి డా. డి. రంజిత్, ఏడీ-9866699401, చార్మినార్.. డా. టి. శ్రీనివాస్, డీడీ- 9989930397, ఖైరతాబాద్.. డా. కె. చక్రపాణి, డీడీ- 9989930358, శేరిలింగంపల్లి..డా. జె.డి. విల్సన్, డీడీ- 9704456521, కూకట్ పల్లి.. డా. సి. సుకునందన్, డీడీ- 9989930359, సికింద్రాబాద్.. డా. వై. సద్గుణ, ఏడీ 9177904941 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.