P Venkatesh
ఏ తల్లి చేయని పని ఆ తల్లి చేస్తూ అమ్మ తనానికే మచ్చ తెస్తోంది. ఏకంగా కూతురిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తోంది. వ్యభిచార కూపంలోకి దించాలని భావిస్తోంది. చివరకు ఆ కూతురు ఏం చేసిందంటే?
ఏ తల్లి చేయని పని ఆ తల్లి చేస్తూ అమ్మ తనానికే మచ్చ తెస్తోంది. ఏకంగా కూతురిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తోంది. వ్యభిచార కూపంలోకి దించాలని భావిస్తోంది. చివరకు ఆ కూతురు ఏం చేసిందంటే?
P Venkatesh
ఏ తల్లి అయినా తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటుంది. పిల్లలకు ఏదైనా కష్టం వస్తే తల్లడిల్లిపోతుంది. వారికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తనలా బిడ్డలు కష్టపడకూడదని వారికి విద్యాబుద్దులు నేర్పిస్తుంది. పిల్లలే లోకంగా జీవిస్తుంది. వారిని ప్రయోజకులను చేసేందుకు నిరంతరం శ్రమిస్తుంది. అందుకే తల్లిని దైవ సమానురాలిగా కొలుస్తారు. చావు అంచుల వరకు వెళ్లి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిది. అందుకే పిల్లలకు తల్లిపై ప్రేమ ఎక్కువ. తల్లి లేకుండా పిల్లలు జీవించడం చాలా కష్టం. తను పస్తులుండి పిల్లల కడుపు నింపుతుంది. తల్లి ఎల్లప్పుడు బిడ్డలపై ప్రేమను పంచుతుంది. అయితే ఓ తల్లి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
అమ్మ అనే పేరుకు మాయని మచ్చ తెస్తోంది. ఆ తల్లి చేసే నిర్వాకం ఏంటో తెలిస్తే మీ ఆవేశం కట్టలు తెంచుకోవడం ఖాయం. ఇంతకీ ఆ తల్లి ఏం చేసిందంటే.. కన్న కూతురిని వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసింది. గత కొన్ని రోజులుగా కూతురును వ్యభిచారం చేయాలని తల్లి వేధిస్తోంది. ఈ అమానుష ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చివరకు ఆ కూతురు వ్యభిచార కూపంలోకి దిగిందా? అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అల్వాల్ జేజేనగర్ సమీపంలో నివసించే మహిళ (37)కు ఇద్దరు కుమార్తెలు. కొన్నేళ్ల క్రితం ఆమెను భర్త వదిలేశాడు. అప్పటి నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఇద్దరు కుమార్తెలను పోషిస్తోంది. ఈ సమయంలోనే ఆ మహిళకు చెడు ఆలోచన మదిలో మెదిలింది.
తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే అత్యాశ పెంచుకుంది. డబ్బు కోసం కూతుర్లని వాడుకోవాలని చూసింది. ఈ క్రమంలో పెద్ద కుమార్తెను వ్యభిచార కూపంలోకి దింపింది. లోకంలో ఏ తల్లి చేయని విధంగా విటుల వద్దకు కన్న కూతుర్ని పంపించి డబ్బులు సంపాదిస్తోంది. చిన్న కుమార్తె (14)ను కూడా వ్యభిచారం కూపంలోకి దించేందుకు ప్రయత్నాలు మెుదలు పెట్టింది. బాలికను ఐదో తరగతి వరకూ చదివించింది. ఆ తర్వాత బడికి మాన్పించి ఇంటి వద్దే ఉంచుతోంది. అక్క మాదిరిగానే వ్యభిచారం చేయాలని గత కొన్నిరోజులుగా బాలికను వేధిస్తోంది. తల్లి ఒత్తిడిని తట్టుకోలేకపోయిన బాలిక ఇంట్లో నుంచి పారిపోయింది. తల్లికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఆ బాలిక అల్వాల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. తన తల్లి చేస్తున్న వికృత చేష్టలను పోలీసులకు వివరించింది. బాధితురాలిని ఓదార్చిన పోలీసులు.. ఆమెను సఖి కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి గురువారం (అక్టోబరు 17) పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. తన కుమార్తెను అప్పగించాలని పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది. ఆమెతో పాటు మరో మహిళ కూడా పోలీసు స్టేషన్‌కు చేరుకొని పోలీసులను తిట్టింది. అనంతరం ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితురాలిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కన్న తల్లి కూతుర్ల పట్ల ఇలా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కన్న తల్లి కూతురిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.