iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో ఇళ్లు కొన్నవారికి బ్యాడ్ న్యూస్.. నిలిచిపోయిన 25 హౌసింగ్ ప్రాజెక్టులు..

  • Published Aug 16, 2024 | 3:01 PM Updated Updated Aug 16, 2024 | 3:01 PM

Huge Loss For Those Who Bought Those Homes And Flats In Hyderabad: హైదరాబాద్ లో అలాంటి ఇల్లు గానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ గానీ కొన్నారా? అయితే మీకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో చోటుచేసుకున్న తీవ్ర పరిణామాల కారణంగా మీరు భారీగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Huge Loss For Those Who Bought Those Homes And Flats In Hyderabad: హైదరాబాద్ లో అలాంటి ఇల్లు గానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ గానీ కొన్నారా? అయితే మీకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో చోటుచేసుకున్న తీవ్ర పరిణామాల కారణంగా మీరు భారీగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

హైదరాబాద్‌లో ఇళ్లు కొన్నవారికి బ్యాడ్ న్యూస్.. నిలిచిపోయిన 25 హౌసింగ్ ప్రాజెక్టులు..

హైదరాబాద్ లో ఇల్లో, ఫ్లాటో, స్థలంలో కొనుక్కుంటే లాభం తప్ప నష్టమేమీ ఉండదని ఒక నమ్మకం. దీంతో కొనేవారు ఎగబడుతూ ఉంటారు. దానికి తగ్గట్టే డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ధరలు కూడా సామాన్యులు అందుకోలేని స్థాయిలో ఉంటాయి. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు పొదుపు డబ్బు కొంత, లోన్ తీసుకుని కొంత సర్దుకుని ఒక ఫ్లాట్ లేదా ఇల్లు కొంటారు. అలా కొన్నవారిలో మీరు కూడా ఉన్నారా? అయితే మీకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ లో పలు ఇళ్లు, అపార్టుమెంట్ల నిర్మాణాలు ఆగిపోయాయి. హైదరాబాద్ సిటీలో 25 హౌసింగ్ ప్రాజెక్టుల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

డేటా అనలిటిక్ కంపెనీ ప్రాప్ ఈక్విటీ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 42 సిటీల్లో మొత్తం 1981 హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ పనులు ఆగిపోయాయి. మొత్తం 5.08 లక్షల అపార్టుమెంట్లు, ఇళ్ళ నిర్మాణాలు ఆగిపోయాయి. ఇలా జరగడానికి కారణం డెవలపర్ల ఆర్థిక నిర్వహణ సరైన మార్గంలో లేకపోవడమే అని ప్రాప్ ఈక్విటీ కంపెనీ తెలిపింది. హౌసింగ్ ప్రాజెక్టుల అమలు సామర్థ్యాలు డెవలపర్లకు లేకపోవడమే ప్రాజెక్టులు ఆగిపోవడానికి కారణమని నివేదికలో తెలిపింది. కొనుగోలుదారుల డబ్బుని లోన్లు చెల్లించేందుకు వాడడం, కొత్త భూముల కోసం వినియోగించడం వంటివి చేయడం వల్ల ప్రాజెక్టులు ఆగిపోయినట్లు ప్రాప్ ఈక్విటీ తెలిపింది. ఇలా దేశవ్యాప్తంగా ఆగిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులు 1636 ఉంటే అందులో 4,31,946 ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి.

దేశంలో 14 నగరాల్లో 4 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. ఆగిపోయిన వాటిలో మరో 345 ప్రాజెక్టులకు చెందిన 76,256 ఇళ్ల నిర్మాణాలు 28 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఉన్నాయి. ఇలా ఆగిపోవడం అనేది ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ జరిగింది. 2018లో 4,65,555 ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు 5,08,202 ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. హైదరాబాద్ లో 25 హౌసింగ్ ప్రాజెక్టులు ఆగిపోగా.. అందులో 6,169 ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నాయి. ముంబైలో 234 ప్రాజెక్టులు ఆగిపోగా.. బెంగళూరులో 225 ప్రాజెక్టులు ఆగిపోయాయి. పుణెలో 172 ప్రాజెక్టులు, గురుగ్రామ్ లో 158, నోయిడాలో 103,చెన్నైలో 92 ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఘజియాబాద్ లో 50, ఫరీదాబాద్ లో 16, ఢిల్లీలో ఒక హౌసింగ్ ప్రాజెక్టు ఆగిపోయాయి. లక్షల్లో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి.

దీంతో నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్స్ కొన్నవారు ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ లోన్ పెట్టుకుని, అప్పు చేసి కొనుగోలు చేస్తారు. అయితే ఇప్పుడు నిర్మాణం ఆలస్యం అవుతుండడంతో ఈఎంఐ భారం ఎక్కువవుతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే డెవలపర్ల సామర్థ్యాలను అంచనా వేసి నిర్మాణంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలని ప్రాప్ ఈక్విటీ సీఈఓ సమీర్ చెబుతున్నారు. అయితే ఇలా ఆగిపోయిన ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 నవంబర్ నెలలో ఒక స్కీంని తీసుకొచ్చింది.

స్పెషల్ విండో ఫర్ అఫర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ ఫండ్ పేరుతో ఈ స్కీంని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం ద్వారా ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తుంది. గడిచిన ఐదేళ్లలో 32 వేల ఇళ్లను పూర్తి చేసింది. వచ్చే మూడేళ్ళ పాటు ఏడాదికి 20 వేల ఇళ్లను పూర్తి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. నిర్మాణం జరిగిన తర్వాత ఫ్లాట్ లేదా ఇల్లు కొన్నవారికి ఎలాంటి సమస్య లేదు కానీ నిర్మాణంలో ఉండగా ఇల్లు గానీ ఫ్లాట్ గానీ కొన్నవారికే ఇప్పుడు అసలైన సమస్య.