iDreamPost
android-app
ios-app

అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం.. అసలేం జరిగిందంటే?

  • Published Jun 03, 2024 | 10:29 AMUpdated Jun 03, 2024 | 11:05 AM

Los Angeles: విదేశాల్లో తమ పిల్లలు గొప్ప చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సంపాదిస్తారని తల్లిదండ్రుల ఎంతో ఆశపడుతున్నారు. కానీ ఇటీవల ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన వారు కనిపించకుండా పోవడం, కన్నుమూయడంతో తీవ్ర ఆందోళ, మనో వ్యధకు గురవుతున్నారు.

Los Angeles: విదేశాల్లో తమ పిల్లలు గొప్ప చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సంపాదిస్తారని తల్లిదండ్రుల ఎంతో ఆశపడుతున్నారు. కానీ ఇటీవల ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన వారు కనిపించకుండా పోవడం, కన్నుమూయడంతో తీవ్ర ఆందోళ, మనో వ్యధకు గురవుతున్నారు.

  • Published Jun 03, 2024 | 10:29 AMUpdated Jun 03, 2024 | 11:05 AM
అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం.. అసలేం జరిగిందంటే?

ఉన్నత విద్య ఉంటే..ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయని నమ్మకం. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్ని కష్టాలు పడైనా సరే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పించి చదివిస్తుంటారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్తున్నారు. కొంతమంది అక్కడే స్థిరపడుతుంటే.. మరికొంత మంది స్వదేశాలకు వచ్చి మంచి పొజీషన్లో స్థిరపడుతున్నారు. ఇటీవల విదేశాల్లో విద్యనభ్యసించడానికి వెళ్లిన వారికి సెక్యూరిటీ లేకుండా పోతుంది. పలువురు విద్యార్థులు చనిపోవడం, దాడులు, హత్యలకు గురి కావడం.. మరికొందరు అదృశ్యం కావడం జరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. అగ్ర రాజ్యమైన అమెరికాలో తెలుగు విద్యార్థులకు భరోసా లేకుండా పోతుంది. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో అదృశ్యం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వివరాల్లోకి వెళితే..

అగ్ర రాజ్యం అయిన అమెరికాలో మరో సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ హైదరాబాద్ కి చెందిన ఓ యువతి అదృశ్యం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. కందుల నితిషా (23) మే 28 నుంచి కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ఆమె కాల్ స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతుంది. నితిషా కనిపించుటలేదని ఫిర్యాదు అందిందని.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఆమెను కనిపెట్టే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. కందుల నితిషా కాలిఫోర్నియాలోని లాసె ఏంజెల్స్ నుంచి కనిపించకుండా పోయిందని.. ఆమె ఆచూకీ లభిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రకటన షేర్ చేశారు.

ఇదిలా ఉంటే.. అమెరికా చికాగోలో తెలంగాణకు చెందిన విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది (25) అనే ఓ విద్యార్థి అదృశమ్యాడు. రూపేష్ విస్కాన్సిన్ లోని కాంకోర్డియా యూనివర్సిటో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. ఈ ఘటనకు ముందు క్లీవ్ ల్యాండ్ నగరంలో మహ్మద్ అబ్దుల్ (25) అనే మరో విద్యార్థి అదృశ్యమై తర్వాత శవంగా కనిపించాడు. గత ఏడాది ప్రతీక్షా కున్వర్ (24) విద్యార్థిని రోడ్డ ప్రమాదంలో చనిపోయింది. ఇలా అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో విదేశీయులకు సెక్యూరిటీ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల్లో ఉన్న తమ పిల్లల గురించి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి