iDreamPost
android-app
ios-app

హైదరాబాద్​లో మరో కేబుల్ బ్రిడ్జి.. ఆ నేషనల్ హైవేతో కనెక్టివిటీ!

  • Published Jul 10, 2024 | 5:52 PM Updated Updated Jul 10, 2024 | 5:52 PM

Cable Bridge: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. సిటీలో మరో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Cable Bridge: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. సిటీలో మరో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Published Jul 10, 2024 | 5:52 PMUpdated Jul 10, 2024 | 5:52 PM
హైదరాబాద్​లో మరో కేబుల్ బ్రిడ్జి.. ఆ నేషనల్ హైవేతో కనెక్టివిటీ!

హైదరాబాద్ సిటీలో రోజురోజుకీ ట్రాఫిక్ మరింత ఎక్కువవుతోంది. నగరం నాలుగు వైపులా విస్తరించడం, ఐటీ కంపెనీలతో పాటు ఇతర రంగాలకు చెందిన పలు సంస్థల్లోనూ ఉద్యోగాల కోసం భారీగా జనం నగరంలోకి రాకపోకలు సాగిస్తున్నారు. జాబ్స్​తో పాటు చదువులు, వ్యాపారాలు కోసమని సిటీకి వచ్చి పోతున్నారు. వైద్యం కోసం నగరానికి రాకపోకలు సాగించే వారు కూడా ఎక్కువయ్యారు. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్​కు భారీగా జనాలు వచ్చిపోవడం, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వర్షం పడినప్పుడు ఇది మరింత తీవ్రంగా మారుతోంది. అందుకే ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్​పాస్​ల నిర్మాణంపై దృష్టి పెడుతోంది.

ఫైఓవర్​లు, అండర్​పాస్​లు, ఫుట్ ఓవర్​ బ్రిడ్జిలు నిర్మించడంతో పాటు అవసరమైన చోటు రోడ్డును విస్తరించడం వంటి పనుల్ని కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. అలాగే కేబుల్ బ్రిడ్జి లాంటివి నిర్మించి ట్రాఫిక్​ను నియంత్రించడంతో పాటు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్​లో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రేవంత్ సర్కారు రెడీ అవుతోంది. ఆల్రెడీ దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఇలాంటిదే మరో బ్రిడ్జి నిర్మాణానికి గవర్నమెంట్ ప్రణాళికలు రచిస్తోంది. పాతబస్తీకి దగ్గర్లోని మీరాలం చెరువును టూరిజం హబ్​గా మార్చేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి హెచ్​ఎండీఏ ప్లాన్స్ వేస్తోంది. దీనికి అవసరమైన పాలనా పరమైన అనుమతులు రావడంతో మీరాలం ఏరియా డెవలప్​మెంట్ ప్లాన్​ రూపకల్పనకు కసరత్తులు మొదలుపెట్టింది.

మీరాలం లేక్ ఫ్రంట్ పార్క్​ను డెవలప్​ చేస్తే పరిసర ప్రాంతాలు మరింత ఆకర్షణీయంగా మారనున్నాయి. దుర్గం చెరువు తరహాలోనే ఇక్కడ కూడా కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్​ను రెండేళ్లలో పూర్తి చేసేలా హెచ్​ఎండీఏ ఒక కన్సల్టెన్సీ ద్వారా ప్రతిపాదనల్ని రూపొందించింది. కొత్త కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.381 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు సర్కారు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జిని బెంగళూరు-హైదరాబాద్ నేషనల్ హైవే 44తో కనెక్ట్ చేయనున్నారు. ఈ హైలెవల్ ఐకానిక్ బ్రిడ్జిని నాలుగు లైన్లతో 2.65 కిలోమీటర్ల పొడువుతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్​లో ఒక చోట 110 మీటర్లతో ఎగ్జిట్ ర్యాంప్​ను ఏర్పాటు చేయనున్నారు. బ్రిడ్జిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు అర్నమెంటల్ లైటింగ్​ను కూడా ఏర్పాటు చేస్తారు. మరి.. హైదరాబాద్​లో రెండో కేబుల్ బ్రిడ్జిని నిర్మించనుండటంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.