Krishna Kowshik
మహ్మద్ గౌస్ చౌదరి,సల్మా భార్యా భర్తలు. తొలుత భర్త బాగానే ఉన్నా.. అతడిలో మార్పులు చోటుచేసుకున్నాయి. భార్యతో గొడవలు పెట్టుకునేవాడు. మానసికంగా,శారీరకంగా హింసించేవాడు.. అవన్నీ తట్టుకుంది. కానీ చివరకు
మహ్మద్ గౌస్ చౌదరి,సల్మా భార్యా భర్తలు. తొలుత భర్త బాగానే ఉన్నా.. అతడిలో మార్పులు చోటుచేసుకున్నాయి. భార్యతో గొడవలు పెట్టుకునేవాడు. మానసికంగా,శారీరకంగా హింసించేవాడు.. అవన్నీ తట్టుకుంది. కానీ చివరకు
Krishna Kowshik
కూతుర్ని అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు.. వారిని పెంచలేక మరొకరికి అప్పగించడం లేదు. మేము ముసలి అయ్యాక తను ఒంటరి కాకూడదు, తనను చూసుకునే వ్యక్తి ఉండాలని, తనకంటూ పిల్లా, పాప ఉండాలన్న ఉద్దేశంతో పెళ్లి పేరుతో ఓ అయ్య చేతిలో పెడతారు. తల్లిదండ్రుల దగ్గర అపురూపంగా పెరిగిన అమ్మాయి.. అత్తారింట్లో అన్నింటా సర్దుకుపోయి బతుకుతుంటారు. కట్నకానుకలు ఇచ్చి, తన ఇంటి పేరు మార్చుకుని వచ్చిన కోడల్ని దేవతలా కాదు కదా.. కనీసం మనిషిలా చూడటం లేదు కొంత మంది. ప్రతి విషయంలో చీకటి మాటికి గొడవలు పడటం, పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురా అని హింసించడం, అసభ్య పదజాలంలో దూసిస్తూ శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ఉంటారు. ఇప్పుడు ఓ మహిళ కూడా ఇలాంటి వేధింపులకే బలైంది.
అత్తారింటి ఆరళ్లు, అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త వేధింపులను తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ అల్లాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అల్లాపూర్ ఎస్డీ ఫంక్షన్ హాల్ సమీపంలో నివసిస్తున్నారు భార్యా భర్తలు మహ్మద్ గౌస్ చౌదరి, సల్మా బేగం. పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నా.. తర్వాత తర్వాత అతడిలో పెను మార్పు వచ్చింది. అదనపు కట్నం తీసుకురావాలంటూ సల్మాను వేధించడం మొదలు పెట్టాడు. ఆమెపై భౌతికంగా దాడి చేసేవాడు. తొలుత తట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత వాటిని భరించలేకపోయింది ఈ ఇల్లాలు. మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బలవన్మరనానికి పాల్పడింది. ఫ్యాన్ హుక్కుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, ఆమె మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లుడి వేధింపులు తట్టుకోలేక కూతురు బలవంతంగా ప్రాణాలు తీసుకుందని కంప్లయింట్‌లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వరకట్న వేధింపులకు మరో ఆడపిల్ల బలైంది. భర్త తిడుతున్నా, కొడుతున్నాఇది తన సంసారం అని భావించే ఎంతో మంది మహిళలు.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా.. తమ సంసారం ఎంతో చక్కగా ఉందని చెబుతుంటారు. అలాగే అవసరాలు ఉన్నాయని కొంత డబ్బులు తీసుకుంటారు. ఇదే అదునుగా తీసుకున్న భర్తలు సైతం.. అత్తామమల దగ్గర డబ్బేదో మూలుగుతుందని భావించి డబ్బులు తీసుకురావాలంటూ హింసకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక అతివలు ప్రాణాలు తీసుకుంటున్నారు.