P Venkatesh
హైదరాబాద్ లో బైక్ రేసింగులకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝుళిపించారు సైబరాబాద్ పోలీసులు. ఏకంగా 50 బైక్ లను సీజ్ చేసి యువకులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ బైకుల్లో ఒక్కోటి 3 లక్షలపైమాటే అంటున్నారు పోలీసులు.
హైదరాబాద్ లో బైక్ రేసింగులకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝుళిపించారు సైబరాబాద్ పోలీసులు. ఏకంగా 50 బైక్ లను సీజ్ చేసి యువకులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ బైకుల్లో ఒక్కోటి 3 లక్షలపైమాటే అంటున్నారు పోలీసులు.
P Venkatesh
బైక్ రైడింగ్ లపై యూత్ కు యమ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ అలవాటు కాస్త అదుపు తప్పుతోంది. ఇష్టారీతిలో బైక్ లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు కొంతమంది ఆకతాయిలు. హైదరాబాద్ లో కొందరు ఆకతాయిలు బైక్ లపై స్టంట్స్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. అధిక స్పీడుతో దూసుకువెళ్తూ.. ప్రమాదకరమైన రీతిలో స్టంట్స్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తోటి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తూ బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో బైక్ రేసింగ్ లకు పాల్పడిన వారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 బైకులను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బైక్ లన్నీ3 లక్షలకు పైమాటే ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని కొంత మంది ఆకతాయిలు బైక్ స్టంట్స్ తో రెచ్చిపోతున్నారు. రాత్రి అయితే చాలు బైకులతో రోడ్లపైకి చేరి రేసింగులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బైకర్లు రకరకాల విన్యాసాలతో రెచ్చిపోతున్నారు. వీకెండ్ రోజుల్లో ఇది మరింత ముదురుతోంది. బైక్ రేసింగులు జరుగుతున్నాయన్న సమాచారం తెలియడంతో.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ రేసింగ్ నిర్వహిస్తుండగా 50 బైక్ లను సీజ్ చేశారు సైబరాబాద్ పోలీసులు. శనివారం (జూన్ 1) రాత్రి టీ హబ్ ఏరియా, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్ ఏరియా, సత్య భవనం, మైహోం భుజ ప్రాంతాల్లో బైక్ రేసింగ్ పాయింట్లపై రాయదుర్గం పోలీసు లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ క్రమంలో రేసింగ్ లకు పాల్పడుతున్న 50 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సదరు వాహనదారులకు సంబంధించిన 50 బైకులను సీజ్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు రాయదుర్గం పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బైకులను అర్టీఓ అధికారులకు అప్పగించారు పోలీసులు. అయితే పోలీసులు సీజ్ చేసిన బైక్ లలో కొన్ని మినహా మిగతావి అన్నీ లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ బైక్ లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీటి ఖరీదు ఒక్కోటి 3 లక్షలకు పైనే ఉంటుందని అంటున్నారు పోలీసులు. బైక్ రేసింగ్ లకు పాల్పడుతూ వాహనదారులకు ఇబ్బందులు కలుగ జేసే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.