P Venkatesh
బాణాసంచా కాల్చాలని జోష్ లో ఉన్న వాళ్లకు హైదరాబాద్ పోలీసులు జలక్ ఇచ్చారు. జంట నగరాల్లో టపాసులు పేల్చడంపై ఆంక్షలు విధించారు. ఏకంగా మూడు రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
బాణాసంచా కాల్చాలని జోష్ లో ఉన్న వాళ్లకు హైదరాబాద్ పోలీసులు జలక్ ఇచ్చారు. జంట నగరాల్లో టపాసులు పేల్చడంపై ఆంక్షలు విధించారు. ఏకంగా మూడు రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
P Venkatesh
దీపావళి వేడుకలకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. అంగరంగవైభవంగా వేడుకలను జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీపావళి అనగానే టపాసులు గుర్తుకొస్తాయి. రకరకాల బాణాసంచా పేల్చుతూ పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవడం మనం చూస్తుంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు కలిసి వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో బాణాసంచా దుఖాణాలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. కస్టమర్లకు కావాల్సిన టపాసులు అందుబాటులో ఉన్నాయి. అయితే బాణాసంచా కాల్చాలని జోష్ లో ఉన్న వాళ్లకు హైదరాబాద్ పోలీసులు జలక్ ఇచ్చారు. జంట నగరాల్లో టపాసులు పేల్చడంపై ఆంక్షలు విధించారు. పూర్తి విరాల్లోకి వెళ్తే..
దీపావళి వేడుకను పురస్కరించుకుని బాణాసంచా కాల్చడం సర్వసాధారణం. నగరమంతా టపాసులు చేసే శబ్ధాలతో మారుమ్రోగిపోతుంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో టపాసులు పేల్చడంపై ఆంక్షలు విధించారు. ఆ సమయాల్లోనే పేల్చాలంటూ స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి సిటీ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు.
నివాస ప్రాంతాల్లో భారీ శబ్దం వచ్చే టపాసులు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని నోటీసుల్లో సూచించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ శాండిల్య హెచ్చరించారు. కాగా కాలుష్య నివారణ కోసం ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్, బాణాసంచా ఇంకా ఇతర వస్తువులను వాడకుండా బ్యాన్ చేయడమో, ఆంక్షలు విధించడమో చేస్తున్నారు. పర్యావరణ హితమైన వాటితోనే పండగలను జరుపుకోవాలని సూచిస్తున్నారు. సాధారణ టపాసులకు బదులుగా గ్రీన్ కాకర్స్‌తో పండగను జరుపుకోవాలని కోరుతున్నారు.