iDreamPost
android-app
ios-app

స్పా సెంటర్‌లపై పోలీసులు దాడి..! ఐదుగురు యువతులు అరెస్ట్

  • Published Jan 06, 2024 | 1:21 PM Updated Updated Jan 06, 2024 | 3:11 PM

డబ్బు కోసం కొంతమంది కేటుగాళ్లు ఎన్నో అక్రమ దందాలు చేస్తున్నారు. ఇందులో ఒకటి హైటెక్ వ్యభిచారం. అపార్ట్ మెంట్స్, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార దందా చేస్తూ విటుల నుంచి డబ్బులు రాబడుతున్నారు.

డబ్బు కోసం కొంతమంది కేటుగాళ్లు ఎన్నో అక్రమ దందాలు చేస్తున్నారు. ఇందులో ఒకటి హైటెక్ వ్యభిచారం. అపార్ట్ మెంట్స్, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార దందా చేస్తూ విటుల నుంచి డబ్బులు రాబడుతున్నారు.

స్పా సెంటర్‌లపై పోలీసులు దాడి..! ఐదుగురు యువతులు అరెస్ట్

ఈ మద్య కొంతమంది డబ్బు సంపాదించడానికి కొంతమంది ఎలాంటి అక్రమాలకైనా పాల్పపడుతున్నారు. సమాజంలో లగ్జరీ జీవితం గడపాలంటే డబ్బు కావాలి.. అందుకోసం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి డ్రగ్స్, అక్రమాయుధాల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం లాంటి దందాలు చేస్తూ లక్షలు, కోట్లు గడిస్తున్నారు. పోలీసుల దాడుల్లో దోరికి కటకటాల వెనక్కి వెళ్తున్నారు. ఈ మద్య పెద్ద పెద్ద నగరాల్లో అపార్ట్ మెంట్స్, షాపుల్లో స్పా సెంటర్ల ముసుగులో కొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.. పోలీసులు దాడి చేసి వారి గుట్టు విప్పుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించి క్రాస్ మసాజింగ్ చేయిస్తున్న నిర్వహకులను అదుపులోకి తీసుకునున్నారు వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్పా సెంటర్ల ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నా కేటుగాళ్ళులు. గ్రామాల నుంచి వలస వచ్చిన మహిళలు, లగ్జరీ లైఫ్ జీవించేందుకు ఇష్టపడే యువతులను కొంతమంది దళారులు టార్గెట్ చేసుకొని వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. అలాంటి వారు తమ అందాలను యువకులకు ఎరవేసి వారి నుంచి డబ్బులాగుతున్నారు. మరికొంతమంది బయటికి పార్లర్, స్పా సెంటర్లు నడిపిస్తూ.. లోపల మాత్రం వ్యభిచార దందాలు నిర్వహిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అలాంటి వారిపై దాడులు నిర్వహించి యువతులు, మహిళలు, నిర్వాహకులను అరెస్టు చేస్తున్నారు. తాజాగా క్రాస్ మసాజింగ్ చేస్తున్న స్పా సెంటర్లపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.

గుడిమల్కాపూర్ ఏరియాలో కొంతమంది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, గుడి మల్కాపూర్ స్టేషన్ పోలీసులు సంయుక్తంగా కలిసి నానల్ నగర్ చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో జన్నత్ గోల్డెన్ అనే రెండు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. క్రాస్ మసాజ్ చేస్తున్న ఐదుగురు అమ్మయిలతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని యజమానులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా గుడిమల్కాపుర్ ఇన్స్‌పెక్టర్ ముజీబ్ రెహ్మాన్ మాట్లాడుతూ.. స్పా సెంటర్లు ఎక్కడ ఉన్నా భవన యజమానులు వారిని వెంటనే ఖాళీ చేయించాలి, లేదంటే వారి పై తగు చర్యలు తీసుకుంటాం. స్పా సెంటర్ ముసుగులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి.. యువకులు ఎవ్వరూ స్పా సెంటర్లకు వెళ్లవద్దు. రేక్రేశన్ క్లబ్ లకు వెళ్లేవారిపై కేసు నమోదు చేయాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.