iDreamPost
android-app
ios-app

Hyderabadలో అమల్లోకి కొత్త నిబంధనలు.. 10.30 దాటితే అవన్నీ బంద్‌

  • Published Jun 24, 2024 | 8:55 AM Updated Updated Jun 24, 2024 | 8:57 AM

హైదరాబాద్‌ వాసులకు పోలీసులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. నగరంలో కొత్త రూల్స్‌ అమలు చేయబోతున్నారని సమాచారం. దాంతో జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ వాసులకు పోలీసులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. నగరంలో కొత్త రూల్స్‌ అమలు చేయబోతున్నారని సమాచారం. దాంతో జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ వివరాలు..

  • Published Jun 24, 2024 | 8:55 AMUpdated Jun 24, 2024 | 8:57 AM
Hyderabadలో అమల్లోకి కొత్త నిబంధనలు.. 10.30 దాటితే అవన్నీ  బంద్‌

తెలంగాణలో అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. సంచలన నిర్ణయాలతో పాలనలో ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఓవైపు జనాలకు సంక్షేమ పాలన అందిస్తూనే.. మరోవైపు పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే డ్రగ్స్‌ కట్టడిపై దృష్టి పెట్టిన రేవంత్‌ రెడ్డి.. ఆమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంజాయి, మత్తు పదార్థాల కట్టడిలో కఠినంగా ఉండాలని సూచించారు. అలానే ఆహార కల్తీని అరికట్టడం కోసం కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు రేవంత్‌ రెడ్డి. అందుకు ఫలితమే.. హైదరాబాద్‌లోని రెస్టారెంట్ల మీద వరుస దాడులు జరగడం. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. దాంతో హైదరాబాద్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు..

సంచలన నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తాజాగా పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నగరంలో కొత్త నియమాలు అమల్లోకి రావడం మాత్రమే కాక.. హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకు ఆ నియమాలు ఏంటంటే.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని.. రోడ్లపై అల్లర్లు సృష్టించొద్దని పోలీసులు హెచ్చరికాలు జారీ చేశారు. మరోవైపు… అనుమానాస్పద వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొద్దని సూచించారు. నగరంలో దుకాణాలు రాత్రి 10.30 నుంచి 11 గంటల్లోపు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి.. గంజాయి సరఫరాదారులను, గంజాయి తీసుకునే వారిని వదిలిపెట్టేది లేదని.. అర్ధరాత్రి ఎవరైనా జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటమని పోలీసులు హెచ్చరికాలు జారీ చేసినట్టుగా.. తెలంగాణ కాంగ్రెస్‌ తన అధికార ట్విట్టర్‌లో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

New rules come into force in Hyd

హైదరాబాద్‌లో ఇటీవల హత్యలు, హత్యాయత్నాలు జరగటం, నడి రోడ్డు మీద దాడులకు పాల్పడటం.. కొన్ని చోట్ల భూమి తగాదాల ఘర్షణలు, పట్టపగలు, రాత్రిళ్లు అనే తేడా లేకుండా దొంగతనాలు లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటుండటం.. రాత్రిళ్లు పలు చోట్ల యువత బైక్ రేసింగులతో రెచ్చిపోతుండటం, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోతుండటంతో.. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

ఇప్పటికే.. బైక్ రేసింగులకు పాల్పడుతున్న పలువురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఓ చోట ఈ రేసింగులు జరుగుతుండటంతో.. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక.. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి లోపం తలెత్తొద్దని రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు.. పోలీసులు నగరవాసులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. వీటిని అదిగమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.