iDreamPost
android-app
ios-app

Hyderabad: తండ్రి లేడు.. ఆ తల్లి ప్రాణాలన్ని బిడ్డ మీదే.. కానీ చివరకు

  • Published Jun 25, 2024 | 2:54 PM Updated Updated Jun 25, 2024 | 2:54 PM

కొన్నాళ్ల క్రితం తండ్రి వదిలేసి వెళ్లాడు. తల్లి ప్రాణాలన్ని బిడ్డ మీదనే. కానీ కుమార్తె చేసిన పనికి ఆ తల్లి ఇప్పుడు గుండెలు పగిలేలా రోదిస్తుంది. ఆ వివరాలు..

కొన్నాళ్ల క్రితం తండ్రి వదిలేసి వెళ్లాడు. తల్లి ప్రాణాలన్ని బిడ్డ మీదనే. కానీ కుమార్తె చేసిన పనికి ఆ తల్లి ఇప్పుడు గుండెలు పగిలేలా రోదిస్తుంది. ఆ వివరాలు..

  • Published Jun 25, 2024 | 2:54 PMUpdated Jun 25, 2024 | 2:54 PM
Hyderabad: తండ్రి లేడు.. ఆ తల్లి ప్రాణాలన్ని బిడ్డ మీదే.. కానీ చివరకు

అందరిలానే ఆ మహిళ కూడా పెళ్లి చేసుకుని భర్తతో కలిసి సంతోషంగా జీవించాలని భావించింది. వివాహం అయ్యింది.. ఓ కుమార్తె జన్మించింది. కొన్నాళ్ల పాటు బాగానే ఉంది. సంతోషంగా సాగుతున్న మహిళ జీవితంలో అనుకోని కుదుపు. తనను, బిడ్డను వదిలేసి భర్త వెళ్లిపోయాడు. ఇక అప్పటి నుంచి ఆమె ప్రాణాలన్ని బిడ్డ మీదనే. కంటికి రెప్పలా కాచుకుంది. కన్న బిడ్డను బాగా చదివించి.. తన కాళ్ల మీత తాను నిలబడేలా తీర్చిదిద్దాలని భావించింది. ప్రస్తుతం కుమార్తె ఇంటర్‌ చదువుతోంది. బిడ్డను బాగా చదవించాలని తల్లి ఆశపడింది. కానీ కుమార్తెకు చదువు మీద ఆసక్తి లేదు. ఈ క్రమంలో చదువు మానేసి.. అమీర్‌పేటలోని ఓ షోరూంలో పనికి కుదిరింది. కట్‌ చేస్తే.. ఆ తల్లికి తీరని గర్భశోకం మిగిల్చింది కుమార్తె. ఆ వివరాలు..

బిడ్డను బాగా చదివించాలని ఆ తల్లి ఆశించింది. కానీ కుమార్తె మాత్రం.. చదవడం తన వల్ల కాదని తేల్చి చెప్పింది. ఖాళీగా ఇంటి దగ్గర ఉండటం ఎందుకు అని భావించిన యువతి అమీర్‌పేటలోని ఓ షోరూంలో పనికి కుదిరింది. అయితే ఆ యువతి సరిగా పనిచేయడం లేదంటూ షాపు యజమాని.. ఆమె తల్లికి ఫిర్యాదు చేశాడు. దాంతో తల్లి కుమార్తెను మందలించింది. ఈ ఘటనతో మనస్థాపానికి గురైన మైనర్‌ యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌, మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలిని నామవరపు జ్యోత్స్నశ్రీగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జ్యోత్స్న శ్రీ అనే యువతి తన తల్లి రజినీతో కలిసి.. ఆమె పిన్ని సర్వూప ఇంట్లో నివాసం ఉంటుంది.

పదో తరగతి వరకు భద్రాచలంలో చదివిన జ్యోత్స్న.. ఇంటర్‌లో బైపీసీ తీసుకుంది. టెన్త్‌ వరకు తెలుగు మీడియంలో చదివిన జ్యోత్స్న శ్రీని.. ఇంటర్‌లో ఇంగ్లీష్‌ మీడియంలో జాయిన్‌ చేసింది ఆమె తల్లి రజినీ. భద్రాచలంలోని ప్రభుత్వ గురుకుల కాలేజీలో చేర్చింది. అయితే ఇన్నాళ్లు తెలుగు మీడియాలో చదివి.. ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా ఇంగ్లీష్‌ మీడియానికి మార్చడంతో.. పాఠాలు అర్థం కాక జ్యోత్స్న శ్రీ ఇబ్బంది పడింది. దాంతో తనకు ఇంగ్లీష్‌ మీడియం పాఠాలు అర్థం కావడం లేదంటూ.. హైదరాబాద్‌, ఎల్లారెడ్డిగూడలోని తన పిన్ని స్వరూప ఇంటికి వెళ్లింది. భర్త నుంచి విడిపోయిన నాటి నుంచి అనగా గత ఏడాది కాలంగా.. జ్యోత్స్న శ్రీ తల్లి రజినీ కూడా స్వరూప ఇంట్లోనే ఉంటుంది.

చదువుకోనని చెప్పిన జ్యోత్స్న శ్రీ.. అమీర్‌పేటలోని ఓ షోరూంలో పనికి కుదిరింది. అయితే ఆమె సరిగ్గా పని చేయకపోవడంతో.. షాపు ఓనర్‌.. జ్యోత్స్న శ్రీ తల్లికి కాల్‌ చేసి ఆ విషయం చెప్పాడు. భద్రాచలం వెళ్లిన జ్యోత్స్న శ్రీ తల్లి.. బిడ్డకు కాల్‌ చేసి కాస్త అసహనంగా మాట్లాడింది. చదువు రాలేదన్నావ్‌.. కనీసం పనైనా సరిగ్గా చేయకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లి మందలించడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన జ్యోత్స్న శ్రీ.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన స్వరూప.. జ్యోత్స్న ఉరేసుకుని ఉండటం గమనించింది. వెంటనే 108కి కాల్‌ చేసింది. అయితే అప్పటికే జ్యోత్స్నశ్రీ చనిపోయినట్లు వారు వెల్లడించారు. ఈ దారుణం గురించి మృతురాలి పిన్ని.. మధురా నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.