Swetha
హైదరాబాద్ మహా నగరం అంతా ఈరోజు రాత్రి ఒక గంట సమయం పాటు.. అంధకారం కానుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా .. ఈరోజు దేశ వ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. అసలు ఈ ఎర్త్ అవర్ అంటే ఏమిటి! దానికి పవర్ కట్ కు సంబంధం ఏమిటీ ! అనే విషయాలను తెలుసుకుందాం.
హైదరాబాద్ మహా నగరం అంతా ఈరోజు రాత్రి ఒక గంట సమయం పాటు.. అంధకారం కానుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా .. ఈరోజు దేశ వ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. అసలు ఈ ఎర్త్ అవర్ అంటే ఏమిటి! దానికి పవర్ కట్ కు సంబంధం ఏమిటీ ! అనే విషయాలను తెలుసుకుందాం.
Swetha
ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే.. వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. జీవన వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ అనేక మార్పులు సంభవించుకుంటున్నాయి. ఈ క్రమంలో పర్యవరణ పరిరక్షణ మన చేతిలోనే ఉన్న కారణంగా.. ఆ నష్టాన్ని కొంతైన తగ్గించే దిశలో.. వాతావరణంపై ప్రజలలో అవగాహన కల్పించే క్రమంలో.. ఈ ఎర్త్ అవర్ ను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ.. మార్చి 23 రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఎర్త్‌అవర్‌కు పిలుపునిచ్చింది. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యవసరం కానీ విద్యుత్ సరఫరాని నిలిపివేయనున్నారు. ఇందులో భాగంగానే.. ఈరోజు రాత్రి హైదరాబాద్ మహా నగరం అంతా ఓ గంట సమయం పాటు అంధకారంలోకి వెళ్లనుంది.
నైట్ లైఫ్ కు హైదరాబాద్ మహా నగరం పెట్టింది పేరు. రాత్రి సమయంలో విద్యత్ వెలుగుల మధ్య.. మెరిసిపోయే భాగ్యనగరం..మార్చి 23న మాత్రం ఓ గంట పాటు .. చీకటిగా మారనుంది. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం పరిసరాలు, బుద్ధ విగ్రహం, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీ, చార్మినార్, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అపార్ట్‌మెంట్లు, నగరంలోని అన్ని ఇళ్ళు కూడా .. ఇవాళ రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు గంటసేపు కరెంట్ వాడకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఎర్త్ అవర్ అనగానే కేవలం గంట సేపు కరెంట్ వాడకుండా ఉండడం వలన .. చాలా విద్యుత్ సేవ్ అవుతుంది అనే విషయం మాత్రమే అందరికి తెలుసు. కానీ, దీని ద్వారా ప్రపంచానికి చాలా గొప్ప సందేశం వెళ్లనుంది. అంతే కాకుండా దీని వెనుక తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్ మొదలైంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. ఓ గంట సమయం పాటు అందరు ఒక గంటపాటు లైట్లు ఆపివేయాలని పిలుపునిచ్చింది. ఇక అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దీనిని పాటిస్తున్నారు. కొన్ని లక్షల మంది ప్రజలు ఇందులో భాగస్వామ్యమయ్యారు. ప్రస్తుతం ఇందులో 190 దేశాలు భాగస్వామ్యమయ్యాయి. ఇక ఈసారి హైదరాబాద్ మహా నగరం కూడా ఈ గొప్ప కార్యక్రమంలో భాగం అయింది. కాబట్టి అందరు దీనిని ఖచ్చితంగా స్వచ్ఛదంగా పాటించవలసిందిగా.. అధికారులు చెబుతున్నారు. కాలుష్య నివారణలో అందరు భాగస్వాములు కావాల్సిందిగా సూచనలు జారీ చేస్తున్నారు.
ఈ ఎర్త్ అవర్ వలన ప్రకృతికి ఎలా మేలు జరుగుతుందంటే.. ఉదాహరణకు హైదరాబాద్ మహా నగరంలో.. గత 3వారాలుగా గమనిస్తూ వస్తే.. ఈ నెల 2న 3137 మెగావాట్లు, 9న 3144 మెగావాట్లు, 16న 3477 మెగావాట్లు నమోదైంది. ఇవన్నీ కూడా రాత్రి 8గంటల ప్రాంతంలో నమోదైనవే . ఈ లెక్కన 23న సుమారు 3500 మెగావాట్ల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇందులో 10% కేవలం లైటింగ్ కోసమే ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈరోజు రాత్రి ఒక గంట పాటు విద్యుత్ ను ఆపివేస్తే.. 350 మెగావాట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులతో.. సమావేశాలు జరిపారు. కాబట్టి ఓ గంట సమయం పాటు అంతటా కరెంట్ నిలిపివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే పవర్ గ్రిడ్‌కు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు.