Arjun Suravaram
సోషల్ మీడియాలో అపరిచితులపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. ముఖ్యంగా అమ్మాయిలు వీలైనంత వరకు తమ వ్యక్తిగత ఫొటోలు, వివరాలను సామాజిక మాధ్యామాల్లో పోస్ట్ చేయొద్దని ఆయన కోరారు.
సోషల్ మీడియాలో అపరిచితులపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. ముఖ్యంగా అమ్మాయిలు వీలైనంత వరకు తమ వ్యక్తిగత ఫొటోలు, వివరాలను సామాజిక మాధ్యామాల్లో పోస్ట్ చేయొద్దని ఆయన కోరారు.
Arjun Suravaram
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. దాదాపు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే సామాజిక మాద్యమాల కారణంగా ఎన్నిలాభాలు ఉన్నాయో.. అప్రమత్తంగా లేకుంటే.. అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో అనేక మోసాలు, ఘోరాలు ఈ సోషల్ మీడియా కారణంగా జరుగుతున్నాయి. దీని ద్వారా అపరిచత వ్యక్తుల నుంచి అమ్మాయిలు అనేక ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఇటీవలే డీఫ్ పేక్ ద్వారా అమ్మాయిల ఫేస్ లను మార్చేసి అశ్లీల సైట్లో పెడుతున్నారు. అందుకు హీరోయిన్ రష్మిక మందన్నా సంఘటనే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, పోలీసులు ప్రజలను, ముఖ్యంగా అమ్మాయిలకు కీలక సూచనలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అపరిచితులపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. ముఖ్యంగా అమ్మాయిలు వీలైనంత వరకు తమ వ్యక్తిగత ఫొటోలు, వివరాలను సామాజిక మాధ్యామాల్లో పోస్ట్ చేయొద్దని ఆయన కోరారు. శనివారం నగర శాంతి భద్రతల అంశంపై సీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన..తాజాగా నగర పోలీసులు చేధించిన సైబర్ నేరాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ కీలక సూచనలు చేశారు.
ఇక మీడియా సమావేశంలో సిటీ కమిషనర్ శాండిల్య మాట్లాడుతూ..సోషల్ మీడియా ద్వారా నగరానికి చెందిన ఇద్దరు బాలికలను కొందరు ఆగంతకులు ట్రాప్ చేశారని, మూడు నెలలుగా వాళ్ల మధ్య ఛాటింగ్ వ్యవహారం నడిచిందని తెలిపారు. ఆతరువాత ఆ కేటుగాళ్లు బాలికల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశార. చివరకు.. కోరికలు తీర్చకపోతే నెట్లో ఆ ఫొటోలు, వీడియోలు పెడతామని బెదిరించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ ఇద్దరు నిందితుల్ని ట్రాప్ చేసి మరీ పట్టుకున్నారని తెలిపారు. ఈ కేసులపై సీపీ శాండిల్య కీలక విషయాలను వెల్లడించారు.
తాను హైదరాబాద్ సీపీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రెండు కేసులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ రెండు కేసులోనూ యువతులే బాధితులుగా ఉన్నారు. వాళ్ల ఫొటోల్ని మార్ఫింగ్ చేసి దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆ బ్లాక్ మెయిల్లతోనే అత్యాచారం చేశారు. ఈ రెండు ఘటనలు యువతులు సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకోవడం వల్లే.. అపరిచితులతో ఛాటింగ్ చేయడం వల్లే జరిగాయి వివరించారు. కాబట్టి ఎవరూ అలాంటి ట్రాప్‌ల్లో పడొద్దు.. బాధితులు కావొద్దు అని సీపీ సూచించారు. సోషల్ మీడియా పట్ల యువతులు జాగ్రత్తగా ఉండాలని, అకౌంట్‌లలో వ్యక్తిగత ఫొటోలు పెట్టొద్దని ఆయన సూచించారు. ఒకవేళ పెట్టినా సోషల్ మీడియాలో ప్రొఫైల్ లాక్ పెట్టుకోండని తెలిపారు.
అపరిచితుల నుంచి రిక్వెస్ట్ వస్తే అంగీకరించవద్దన్నారు. ఎవరైనా బ్లాక్‌మెయిల్, ఒత్తిడి చేస్తే ఆందోళన చెందకండి. మీకు మేమున్నామని, ఎవరైనా ఇబ్బందులు పెడితే మా అన్న పోలీసు అని చెప్పండని నేరుగా మా నెంబర్లను సంప్రదించండి..ఫోన్ నెంబర్లు.. 9490616555, 8712660001. మీ ఫిర్యాదుల ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. ఇదే సమయంలో తల్లిదండ్రులకు సీపీ పలు సూచనలు చేశారు. పిల్లల తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి ఒక్కటే. వాళ్లతో కలిసి ఉండండి.. ఒంటరిగా వాళ్లను వదిలేయకుండా దృష్టి పెట్టండి. మరి.. హైదరాబాద్ సీపీ ప్రెస్ మీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.