Dharani
మంగళవారం సాయంత్రం కురిసిన వర్షాల కారణంగా హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
మంగళవారం సాయంత్రం కురిసిన వర్షాల కారణంగా హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
Dharani
సోమవారం వరకు రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపించాయి. పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఈ ఏడాది మే నెలలో జనాలు మండే ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని.. కనుక జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఈ ఏడాది అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డుల్లోకి ఎక్కింది. మరో నెల రోజుల పాటు వేడిని ఎలా భరించాలి అని జనాలు ఆందోళన చెందుతున్న వేళ.. వరుణుడు నేనున్నాంటూ పలకరించాడు. మంగళవారం ఉదయం నుంచే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గగా.. సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, చిరు జల్లులు మొదలై.. వాతావరణంలో మార్పు మొదలైంది. అప్పటి వరకు ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు.. చినుకుల తడితో మురిసిపోయారు.
ఇక మంగళవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసింది. భాగ్యనగరం అయితే తడిసి ముద్దయ్యింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు విధించారు అధికారులు. అనుకోని వర్షం జనాలకు ఊరట కలిగించడమే కాక.. తీవ్ర విషాదాన్ని సైతం నింపింది. భారీ వర్షం కారణంగా నిర్మాణంలో ఉన గోడ కూలి ఏడుగురు వలస కూలీలు మృతి చెందగా.. బేగంపేటలో మరో దారుణం వెలుగు చూసింది.
మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్ని జలమయం అయ్యాయి. డ్రైనేజ్‌లు పొంగిపొర్లాయి. బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తి నాళాల్లో గుర్తుతెలియని రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. విషయం తెలుసుకున్న బేగంపేట్ పోలీసులు, డీఆర్ఎఫ్ టీం, క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి వివరాలు తెలుసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన వాన కారణంగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు వలస కార్మికులు మృతి చెందారు. నిర్మాణం కోసం పని చేస్తున్న కార్మికులు.. తాత్కాలికంగా వేసుకున్న షెడ్‌పై నిర్మాణంలో ఉన్న గోడ కూలి పడటంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో షెడ్‌లో ఉన్న కార్మికులు ఏడుగురు మృతి చెందారు. వీరంతా ఒడిషా, జార్ఖండ్ ప్రాంతాలకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీల సాయంతో చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు.