P Venkatesh
హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకులకు క్యూ కట్టడంతో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వేలాదిగా వచ్చిన వాహనాలతో పలు ఏరియాల్లో రోడ్లన్నీ స్థంబించిపోయాయి.
హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకులకు క్యూ కట్టడంతో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వేలాదిగా వచ్చిన వాహనాలతో పలు ఏరియాల్లో రోడ్లన్నీ స్థంబించిపోయాయి.
P Venkatesh
హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగర రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. కానీ నేడు మాత్రం ఆ తీవ్రత ఎక్కువగా ఉంది. దానికి గల కారణం బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత. కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టంతో ఆందోళనకు గురైన ట్రక్కు డ్రైవర్లు సమ్మెకు దిగారు. దీంతో పెట్రోల్, డీజిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో పలు బంకుల్లో నో స్టాక్ బోర్టులు దర్శనమిచ్చాయి. ఈ విషయం తెలిసిన వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకులకు పరుగులు తీశారు. బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్ లోని దాదాపు అన్ని ఏరియాల్లో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఆఫీసులో విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లేవారు, పెట్రోల్, డీజిల్ కోసం రోడ్లపైకి వచ్చి వాహనాలతో వాహనాల రద్దీ పెరిగింది. పెట్రోల్ దొరకదేమోనన్న అనుమానంతో వాహనదారులు బంకులకు క్యూ కట్టడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేలాదిగా వచ్చిన వాహనాలతో బండి ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. మియాపూర్ నుంచి ఇటు ఎల్బీనగర్ వరకు.. ఇటు మెహిదీపట్నం నుంచి అటు సికింద్రాబాద్ వరకు ఎక్కడ చూసినే ఇదే పరిస్థితి. గచ్చిబౌలి, ఐకియా జంక్షన్, కొండాపూర్ ఏరియాల్లోనైతే విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్ – లక్డీకపూల్, మెహదీపట్నం – లక్డీకపూల్ మార్గంలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పంజాగుట్ట – బేగంపేట మార్గంలోనూ వాహనాలతో రోడ్లు నిండిపోయాయి. బంజారాహిల్స్, కూకట్‌పల్లితో పాటు పలు మార్గాల్లోనూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ దృష్ట్యా అవసరం మేరకు తప్పా వాహనదారులు రోడ్లపైకి రావొద్దని ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్నారు. అనవసరంగా బయటికి వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకోవద్దని తెలుపుతున్నారు. అందుకే.. ఆయా రూట్లలో వాహనదారులు బయటకు రావొద్దని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు పైన తెలిపిన ఏరియాల్లో కొంత సమయం వరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోవచ్చని ట్రాఫిక్ అధికారులు వెల్లడిస్తున్నారు.
Colorful Hyderabad mithron🍻#petrolpump #HitAndRunCase #Traffic #NewYear2024 pic.twitter.com/0t7PaIvQGO
— sri harsha (@harsha49094) January 2, 2024
#Hyderabad | Avoid all possible roads which lead to fuel stations. Traffic chaos everywhere.#HitAndRunCase #TruckDriversProtest #हिट_एण्ड_रन_कानून #HitandRunLaw #petrolpump pic.twitter.com/SDft1DLNMA
— Faheem (@stoppression) January 2, 2024