Keerthi
హైదరాబాద్ లో ని ఒకేరోజు రెండు వేరు వేరు సంఘటనలు నగరవాసులకు ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిదంటే..
హైదరాబాద్ లో ని ఒకేరోజు రెండు వేరు వేరు సంఘటనలు నగరవాసులకు ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిదంటే..
Keerthi
భారీ పేలుడు శబ్దంతో భాగ్యనగరం ఉలిక్కిపడింది. బాంబు పేలిందేమో అని భావించిన జనాలు భయంతో పరుగులు తీశారు. అధికారులు రంగంలోకి దిగారు. ఈ సంఘటన చర్లపల్లి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి మ్యాన్ హోల్ మూత అమాంతంగా గాల్లోకి ఎగిరిపడింది. దీంతో కాలనీలో మొత్తం కెమికల్ వాసన వ్యాపించింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో.. స్థానికంగా ఉన్న ప్రజలు భయందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటన చర్లపల్లిలోని వెంకట్ రెడ్డి నగర్ లో గల మధుసూదన్ రెడ్డి నగర్ లో అర్ధరాత్రి జరిగింది. వెంటనే పోలీసులకు స్థానికుల ద్వారా సమాచారం అందడంతో సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం ఘటన స్థలంలోని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ పేలుడుకు గల కారణాలు ఇంక తెలియరాలేదు. కానీ, పరిశ్రమల వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడంతోనే ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అయితే చర్లపల్లిలోని వెంకట్ రెడ్డి నగర్ లో గల మధుసూదన్ రెడ్డి నగర్ చెందిన కాలనీ వాసులు గత రెండు రోజులుగా కెమికల్ దుర్వాసన వస్తుందని వాపోతున్నారు. ఈ కెమికల్ దుర్వాసన వలన ఎక్కడ ఆనారోగ్యానికి దారి తీస్తుంద అని ఆందోళన చెందారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగే ఆవకాశం ఉందని వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కాలానీ వాసులు కోరారు.
అలాగే నగరంలోని ఉప్పల్ లో కూడా మంగళవారం రాత్రి భారీ అగ్నీ ప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పల్ లోని స్థానిక బట్టల దుకాణం అయిన CMR షాపింగ్ లో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే షాపింగ్ మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు క్షణాల్లో మాల్ అంతటికీ వ్యాపించాయి. ఇక ప్రమాద సమయంలో షాపింగ్ మాల్ మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అలాగే ఉప్పల్ పోలీసులు కూడా అర్థరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ, మాల్ ముందు భాగంలో న్యూ ఇయర్ సందర్భంగా డెకరేట్ చేసిన లైటింగ్ వల్ల తొలుత మంటలు వచ్చాయని కొందరు వాహనదారులు,స్థానికులు చెబుతున్నారు. మరి, భాగ్యనగరంలో ఒకేరోజు జరిగిన రెండు వేరు వేరు సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.