కారు బీభత్సం.. డ్రైవర్ పరార్

Car Accident in Jubilee Hills: వారం రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో వ్యక్తి మృతి చెందాడు.. ఈ ఘటన మరువక ముందే మరో హిట్ అండ్ రన్ కేసు కలకలం రేపుతుంది..

Car Accident in Jubilee Hills: వారం రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో వ్యక్తి మృతి చెందాడు.. ఈ ఘటన మరువక ముందే మరో హిట్ అండ్ రన్ కేసు కలకలం రేపుతుంది..

ఇటీవల దేశంలో నిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలైతున్నారు.. ఎంతోమంది వికలాంగులుగా మిగులుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యం, అతి వేగం, అవగాహన లేని వారు వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. చలానాలు విధిస్తున్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అంటున్నారు. హైదరాబాద్ లో మరోసారి కారు బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

ఈ మద్య హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న హిట్ అండ్ రన్ ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. అతి వేగంగా వాహనాలు ఢీ కొట్టి.. ఆపై ఆపకుండా పరారవుతున్న ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. వారం రోజుల క్రితమే జూబ్లీహిల్స్ రోడ్డు నెం 36 లోని పెద్దమ్మ గుడి చౌరస్తా సమీపంలో అతి వేగంగా దూసుకు వచ్చిన కారు బైక్ పై వెళ్తున్న తారక్ అనే వ్యక్తిని ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు రెండు ద్విచక్రవాహనాలపై దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వెలుగులోకి వచ్చింది.  జూబ్లీహిల్స్ లో వైట్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకు వెళ్లి ఎదురుగా రెండు బైకులకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు ఉదయ్, సుష్మ తో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలు కావడంతో మాదాపూర్ లోని మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనలో ఉదయ్, సుష్మకు తీవ్ర గాయాలు కాగా.. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని.. వీరితో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో ట్రిట్ మెంట్ చేయించుకొని డిశ్చార్జ్ అయి వెళ్లిపోయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కారు నెంబర్ ఆధారంగా గుంటూరుకు చెందిన బిక్కి అశోక్ గా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే గుంటూరు బయల్దేరారు పోలీసు బృందం.

Show comments