iDreamPost
android-app
ios-app

హిందీ, ఇంగ్లీషు జాతీయ భాషలు కాదు.. KTR సంచలన వ్యాఖ్యలు!

  • Author Soma Sekhar Published - 05:48 PM, Sat - 28 October 23

హిందీ, ఇంగ్లీష్ భాషలు జాతీయ భాషలు కాదని సంచలన కామెంట్స్ చేశారు కేటీఆర్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

హిందీ, ఇంగ్లీష్ భాషలు జాతీయ భాషలు కాదని సంచలన కామెంట్స్ చేశారు కేటీఆర్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

  • Author Soma Sekhar Published - 05:48 PM, Sat - 28 October 23
హిందీ, ఇంగ్లీషు జాతీయ భాషలు కాదు.. KTR సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడినా.. లెక్కలతో సహా వివరిస్తారని చాలా మందికి తెలిసిన విషయమే. తాను ఎంచుకున్న అంశానికి సంబంధించిన విషయాలను కూలంకుషంగా వివరిస్తారు. దీనితో పాటుగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడటం మనం ఎన్నో సార్లు చూశాం. తాజాగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రిపోర్టర్లతో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసి.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. హిందీ, ఇంగ్లీష్ భాషలు జాతీయ భాషలు కాదని సంచలన కామెంట్స్ చేశారు కేటీఆర్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు. ఎక్కడ ఏం మాట్లాడాలో.. ప్రతిపక్షాలను ఏ ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలీదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇక ప్రెస్ మీట్స్ లో తనదైన శైలిలో ప్రతిపక్షాలపై చెలరేగుతారు కేటీఆర్. తాజాగా శనివారం బషీర్ బాగ్ లో ప్రెస్ క్లబ్ లో రిపోర్టర్లతో కేటీఆర్ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
“దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచింది. అదీకాక ఐటీలో బెంగళూరును హైదరాబాద్ఎప్పుడో దాటేసింది. మేం అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నర ఏళ్లలో ఎన్నో గుణాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ 3వ స్థానంలో ఉండగా.. రాష్ట్ర జీడీపీలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు చెత్తబుట్టలో పడేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలకు 58 ఏళ్లు తెలంగాణ బాధపడింది. రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేయడం వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు” అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్.
ఈ క్రమంలోనే జాతీయ భాషలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందీ, ఇంగ్లీష్ జాతీయ భాషలు కాదని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా.. గతంలో కూడా కేటీఆర్ జాతీయ భాషపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన జాతీయ భాషపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మరి హిందీ, ఇంగ్లీష్ జాతీయ భాషలు కాదు అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.