iDreamPost

హైదరాబాద్ లో భారీ వర్షం.. బయటకు వచ్చి ఈ తప్పులు చేయకండి!

IMD Hyderabad- Heavy Rain In Hyderabad: హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి సమయంలో బయటకు వచ్చి ఇలాంటి తప్పులు మాత్రం చేయద్దు అంటూ హెచ్చరిస్తున్నారు.

IMD Hyderabad- Heavy Rain In Hyderabad: హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి సమయంలో బయటకు వచ్చి ఇలాంటి తప్పులు మాత్రం చేయద్దు అంటూ హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్ లో భారీ వర్షం.. బయటకు వచ్చి ఈ తప్పులు చేయకండి!

హైదరాబాద్ మహానగరంలో భారీగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి వర్షపు నీరు రోడ్లపైకి వచ్చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా వర్షాకాలం ప్రారంభమైపోయినట్లే అనే అంచనాకి వస్తున్నారు. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురవడం స్టార్ట్ అయ్యింది. ఇవాళ మాత్రమే కాకుండా.. దాదాపుగా ఇదే తరహా పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే వర్షం కారణంగా నీళ్లు రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దాదాపుగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఈ వర్షం కురుస్తోంది. వర్షం మొదలై కాసేపు కావొస్తున్నా.. తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇంకా మరికొన్ని గంటలపాటు ఈ వర్షం కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఎవరూ కూడా ఈ వర్షంలో బయటకు రావొద్దు అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా నగరవాసులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మియాపూర్ నుంచి వనస్థలిపురం వరకు భారీ వర్షం కురిసే అవ కాశం ఉందని.. సికింద్రాబాద్- హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే నగరవాసులు అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు వర్షంతో పాటుగా ఈదురు గాలులు ఉన్న నేపథ్యంలో బయటకు వస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పవర్ లైన్స్ తెగి పడిపోవడం, మ్యాన్ హోల్స్ ఓపెన్ లో ఉండటం, కరెంట్ స్తంబాలు నేలకొరిగే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే బయటకు వచ్చి రిస్క్ తీసుకోవద్దు. అలాగే నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయి కాబట్టి.. ఇప్పుడు వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ సీజన్లో కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అనవసరపు తప్పులు చేసి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి