బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళి సై వరుస షాక్ లు ఇస్తున్నారు. ప్రభుత్వం పంపిన పలు రకాల బిల్లులను, వినతులపై గవర్నర్ తిరస్కరణ, జాప్యం వంటివి చేస్తున్నారు. గతేడాది ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన సంగతి తెలిసిందే. అలానే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ప్రవేశ పెట్టిన ఆర్టీసీ బిల్లుకు వెంటనే ఆమోదం తెలుపలేదు. అలా ప్రభుత్వానికి గవర్నర్ షాక్ లు ఇస్తూ ఉన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి మరో షాకిస్తూ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు.
గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫారసును ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియమించాలని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కి అభ్యర్థిత్వాలను పంపింది. సామాజిక సేవ కోటా కింద దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థులకు అర్హత లేదని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఈ ఇద్దరిని ఎంపిక చేయడానికి కావాల్సిన సమచారం లేదని గవర్నర్ అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తున్నట్టుగా తమిళిసై సౌందర్య రాజన్ వివరించారు. మరి.. గవర్నర్ తమిళసై తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్సే రూపంలో తెలియజేయండి.