P Venkatesh
విద్యార్థులకు గుడ్ న్యూస్. పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ స్కూల్స్ లో ఆ మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. ఇంతకీ కారణం ఏంటంటే?
విద్యార్థులకు గుడ్ న్యూస్. పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ స్కూల్స్ లో ఆ మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. ఇంతకీ కారణం ఏంటంటే?
P Venkatesh
ప్రస్తుతం విద్యార్థులకు ఇది పరీక్షల కాలం. త్వరలోనే టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు జరుగనున్నాయి. ముఖ్యంగా పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి రిజల్ట్స్ తీసుకొచ్చేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. టెన్త్ విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాసులు తీసుకుంటూ వారిని పరీక్షల కోసం సిద్ధం చేస్తున్నారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల్లో కొంత ఒత్తిడి ఉంటుందనే చెప్పాలి. అయితే ఆ ఒత్తిడిని కాస్త పక్కకు పెట్టి ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు సెలవులు రాబోతున్నాయి. ఒకటి కాదు ఏకంగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.
ఇరు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. వచ్చే నెల మార్చిలో ఈ సెలవులు ఉండనున్నాయి. మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని మార్చి 08(శుక్రవారం)న సెలవు ఉండనుంది. అదే విధంగా మార్చి 09వ తేదీ రెండో శనివారం సెలవు. కాగా 10వ తేదీ ఆదివారం కావడంతో మూడు రోజులు బడిగంట మూగబోనుంది. ఇక వరుస సెలవులు రానుండడంతో విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. పుస్తకాలతో కుస్తీ పట్టే సమయంలో సెలవులు రానుండడంతో కాస్త రిలీఫ్ దొరికినట్లైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.