P Venkatesh
Mee Seva: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీసేవలో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఆ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు
Mee Seva: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీసేవలో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఆ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు
P Venkatesh
గతంలో క్యాస్ట్, ఇన్ కమ్ ఇతరత్రా ధృవపత్రాలు కావాలంటే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే వారు. కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగినా కూడా సమయానికి సర్టిఫికేట్లు అందకపోయేవి. చివరాఖరికి అధికారుల చేతులు కూడా తడపాల్సిన పరిస్థితి ఉండేది. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మీ సేవా సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రాల ద్వారా ఆన్ లైన్ లోనే సర్టిఫికేట్లను జారీ చేస్తున్నది. మీ సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక ప్రజలకు సమయం, డబ్బు ఆదా అయ్యింది. ఆన్ లైన్ ద్వారా సులభంగా సర్టిఫికేట్లు పొందేందుకు వీలు ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరో 9 సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఆ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు.
రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. మీసేవలో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎంఆర్వో ఆఫీసుల్లో మాన్యువల్‌గా అందిస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్‌ఏ కార్యాలయం ప్రకటించింది. కొత్తగా.. గ్యాప్ సర్టిఫికెట్, పౌరుల పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికెట్, మరోసారి సర్టిఫికెట్ల జారీ (రీ ఇష్యూ), క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు, మార్కెట్ విలువపై సర్టిఫైడ్ కాపీ, పాత రికార్డుల కాపీలు (ఖాస్రా/సెస్సాలా పహాణీ), 1బీ సర్టిఫైడ్ కాపీలు ఇకపై ఆన్‌లైన్‌లో మీసేవ ద్వారా అందజేయనున్నారు. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఆన్ లైన్ లోనే ఈజీగా పొందే వీలు ఏర్పడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.