మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన అధికారులు!

హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన మొదట్లో భారీ నష్టాలు ఎదురయ్యాయని అధికారులు చాలా సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, నగరంలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుండడంతో నగర వాసులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నానాటికి మెట్రో ప్రయాణికులు పెరుగుతున్నారు తప్పా తగ్గడం లేదు. ఇక గత కొన్ని రోజుల నుంచి మెట్రో నష్టాల నుంచి గట్టేక్కి లాభాల్లో పయణిస్తున్నట్లు అధిరారులు తెలిపారు. పెరిగిన రద్దీ దృష్ట్యా మెట్రో రైల్లో కాలు పెడదామంటే సందులేకుండా మారింది.

ఇక రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఇక పెరిగిన రద్దీ దృష్ట్యా మరిన్ని బోగిలు పెంచాలని ప్రయాణికులు అధికారులను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రయాణికుల కోరిక మేరకు త్వరలో అదనంగా మరో మూడు బోగీలను అమర్చే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మరికొన్ని రోజుల్లో మూడు బోగీలు పెరగనుండడంతో ప్రయాణికుల తిప్పలు తప్పనున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న మెట్రో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వారికి సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. రూ.3 లక్షల ఆర్థిక సాయం!

Show comments