P Krishna
Hyderabad: ఇటీవల వర్షాల పుణ్యమా అని పలు జలాశయాలు నిండుకుండలా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.
Hyderabad: ఇటీవల వర్షాల పుణ్యమా అని పలు జలాశయాలు నిండుకుండలా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.
P Krishna
తెలుగు రాష్ట్రాల్లో గత నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గత కొంత కాలంగా హైదరాబాద్ వాసులు నీటి సమస్యలతో ఇబ్బందిగా పడుతున్నారు. గత ఏడాది సరైన వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎదురైంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ నుంచి వాటర్ ట్యాంకులు తెప్పించుకునే పరిస్థితి. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు హైదరాబాద్ జలమండలి కూడా నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇకపై నీటి కష్టాలు ఉండవు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇకపై మంచి నీటి కష్టాలు తీరనున్నాయి.. నగర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గోదావరి ఫేజ్ – 2 తాగు నీటి సరఫరా ప్రాజెక్ట్ కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారుగా రూ.5,560 కోట్ల అంచనా వ్యయంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ సిటీకి మరో 15 టీఎంసీల నీటిని తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. మరో రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మొత్తం వ్యయంలో 40 శాతం హడ్కో లోన్ కింద సర్కార్ సమకూర్చబోతుంది. మిగతా 60 శాతం మొత్తం పనులు చేపట్టే ఏజెన్సీ భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. పనులు పూర్తయిన తర్వాత నిధులు మొత్తం జలమండలి వడ్డీతో సహా చెల్లిస్తుంది.
హైదరాబాద్ లో తాగునీటి అవసరాలకు ప్రతిరోజూ 750 మిలియన్ల గ్యాలన్లు (ఎంజీడీ)కాగా.. సిటీ చుట్టుపక్కల ఉన్న పలు జలాశయాల నుంచి సుమారు 600 ఎంజీడీ మాత్రమే మంచినీరు సరఫరా అవుతుంది. 2050 నాటికి ఈ డిమాండ్ దాదాపు 1014 ఎంజీడీకి పెరుదుతుందని అంచనా. ఇక గోదావరి నుంచి ప్రతి సంవత్సరం 10 టీఎంసీలు అంటే రోజుకు 1720 మిలియన్ గ్యాలన్లు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ సిటీకి తరలిస్తున్నారు. ఫేజ్ 2 ద్వారా వచ్చే నటిలో 10 టీఎంసీలు నగర వాసులకు తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు.