ఎన్నికల కోడ్.. రూ.5.73కోట్ల బంగారం పట్టివేత!

Gold Seized in Miryalaguda: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. గెలుపు కోసం అధికార, ప్రతిపక్షాలు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు సాగుతున్నారు.

Gold Seized in Miryalaguda: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. గెలుపు కోసం అధికార, ప్రతిపక్షాలు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు సాగుతున్నారు.

తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పదేళ్ల బీఆర్ఎస్ ని కాదని కాంగ్రెస్ కి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. అయితే తమ ఓటమికి గల కారణాలపై సమీక్షలు నిర్వహించి ఈసారి రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా జయకేతనం ఎగురవేయాలని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గట్టి పట్టుమీద ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజాదరణ పొందుతూ లోక్ సభలో మరోసాని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది అధికార పార్టీ. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, బంగారంపై నిఘా పెంచారు ఎన్నికల అధికారులు. వివరాల్లోకి వెళితే..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ గట్టిగానే అమలవుతున్నట్లు కనిపిస్తుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుకున్నారు పోలీసులు. మిర్యాలగూడ పట్టణంలో సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా బంగారం పట్టుబడింది. బొలేరో వాహనంలో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ నుంచి కొదాడకు TS 09 UE 2479 బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు గోల్డ్ తరలిస్తున్నారు. దానికి సంబంధించిన ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. వాహనంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5 కోట్ల73 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు విపరీతంగా డబ్బు,బంగారం, వెండి, ఇతర సామాగ్రి తరలిస్తూ ఎన్నికల అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఎన్నిలక సందర్భంగా ఎలక్షన్ కమీషన్ అక్రమ డబ్బు, మద్యం, వస్తువులను పంపిణీ చేస్తూ ప్రలోభ పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ గెలుపే లక్ష్యంగా కొన్ని పార్టీ వర్గాలు ఓటర్లకు అడ్డుగోలుగా డబ్బు, బంగారం, చీరలు ఇతర వస్తువులను పంపిణీ చేయడం చూస్తూనే ఉన్నాం. గోల్డ్ డిస్ట్రిబ్యూటలర్లకు సరఫారా చేసే ఓ ఏజెన్సీకి చెందిన వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Show comments