iDreamPost
android-app
ios-app

ఒకేసారి Gold కొనలేకపోతున్నారా? ఇలా ఈజీగా కొనొచ్చు.. లాభాలు కూడా!

  • Published Nov 06, 2024 | 6:03 PM Updated Updated Nov 06, 2024 | 6:03 PM

Gold: బంగారం అంటే అందరికీ ఇష్టమే. అందుకే చాలా మంది బంగారం కోనాలని ఆశపడతారు.

Gold: బంగారం అంటే అందరికీ ఇష్టమే. అందుకే చాలా మంది బంగారం కోనాలని ఆశపడతారు.

ఒకేసారి Gold కొనలేకపోతున్నారా? ఇలా ఈజీగా కొనొచ్చు.. లాభాలు కూడా!

బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు అంతా ఇంత కాదు. ముఖ్యంగా బంగారమంటే మన భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ బంగారం ధర ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఇబ్బంది లేనివారు దీన్ని ఒకేసారి కొంటారు. అయితే ఒకేసారి బంగారం కొనలేని వారు మాత్రం వాయిదా పద్ధతి (గోల్డ్‌ స్కీం)లో చేరి బంగారు ఆభరణాలను తీసుకోవాలని అనుకుంటారు. అయితే ఒకేసారి కాకుండా ఇలా బంగారం కొంటే కలిగే లాభం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గోల్డ్‌ సేవింగ్‌/డిపాజిట్‌ స్కీంలో 12 నెలల వ్యవధిలో ప్రతి నెల వాయిదా చెల్లించి నగలు కొనడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో చాలా బంగారం షాపులు కూడా ఈ స్కీంలను ఆఫర్‌ చేస్తున్నాయి. చాలా షాపులు ఈ స్కీంలో 12 నెలల వరకు డబ్బుని డిపాజిట్‌ చేసే ఛాన్స్ కల్పిస్తున్నాయి. 12 నెలల తర్వాత మీరు జమ చేసిన డబ్బుకి సరిపడా బంగారు నగలను ఈ స్కీం అందిస్తుంది. ఈ 12 నెలలు వాయిదాలు చెల్లించినందుకు కొనుగోలు చేసిన నగలపై తరుగును, తయారీ ఛార్జీలను తీసివేయొచ్చు లేదా తగ్గించొచ్చు.కొన్ని షాపుల్లో 11 వాయిదాలు మనం చెల్లిస్తే.. 12వ వాయిదా డబ్బుని వారే చెల్లిస్తారు. తర్వాత ఆ బంగారాన్ని ఆ షాపు వద్ద తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని షాపుల వారు కస్టమర్స్ చెల్లించే డబ్బుకి ఆ రోజు నాటికి ఎంత బంగారం వస్తుందో దాన్ని విలువగట్టి దాన్ని గ్రాముల్లో రికార్డ్‌ చేస్తారు. ఏడాది తర్వాత అప్పటివరకు ఎన్ని గ్రాముల బంగారం కొన్నారో లెక్కించి అన్ని గ్రాముల బంగారు నగలను ఇస్తారు. బంగారం ధర చాలా ఏళ్ల నుంచి క్రమంగా పెరుగుతుంది కాబట్టి, ఇలాంటి స్కీం లలో కొనడం చాలా మంచిది. చాలా ఈజీగా కష్టం లేకుండా బంగారం కొనవచ్చు.

ప్రతి రోజు బంగారం ధరను తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. షాపులు కూడా ప్రతిరోజూ బంగారం ధర గురించి బోర్డును పెడతాయి. మనం ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ నెంబర్ 89556 64433 కు మిస్డ్‌ కాల్‌ చేస్తే చాలు.. ఆ రోజు బంగారం ధర తెలుస్తుంది. లేదా https://www.ibja.co వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. గోల్డ్ స్కీం వల్ల ప్రయోజనం ఏంటంటే..ఇందులో బంగారం ధరతో పాటు తయారీ ఛార్జీలు, తరుగు వంటి అదనపు ఖర్చులు మనకు వర్తిస్తాయి. తయారీ ఛార్జీ, తరుగు అనేది ప్రతి ఆభరణానికీ ఒకేలా ఉండదు. అది మారుతుంది. ఈ స్కీంలో జీరో వేస్టేజీ/మేకింగ్‌ ఛార్జీలు కూడా కొన్ని డిజైన్లు, మోడల్స్‌కు మాత్రమే ఉండొచ్చు. మీరు ఒకేసారి బంగారం కొంటె ఇలాంటి ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది. గోల్డ్ స్కీమ్ లో అయితే ఈ ఛార్జీలు పెద్దగా ఉండవు. అయితే ఈ స్కీమ్ లో బంగారం కొనేటప్పుడు పూర్తిగా బంగారం గురించి అవగాహన ఉండాలి. ఈ స్కీం అందించే అదే షాపు వద్ద ఆభరణాలను కొనాలి. మీ డిపాజిట్‌ను డబ్బు రూపంలో తిరిగి ఇవ్వరు, ఆభరణాల రూపంలో మాత్రమే ఇస్తారు. కచ్చితంగా ‘బీఐఎస్‌’ హాల్‌మార్కింగ్‌ గల బంగారు ఆభరణాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇదీ సంగతి.. ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.