Keerthi
Hyderabad, GHMC Alert: నగరంలో నేడు కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాల తీవ్రత దృష్ట్యా GHMC అధికారులు ప్రజలకు బిగ్ అలర్ట్ ను జారీ చేశారు.
Hyderabad, GHMC Alert: నగరంలో నేడు కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాల తీవ్రత దృష్ట్యా GHMC అధికారులు ప్రజలకు బిగ్ అలర్ట్ ను జారీ చేశారు.
Keerthi
గత రెండు రోజులుగా ఏపీ తెలంగాణల్లో కుండపోత వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో చూసిన వాగులు, నదులు, చెరువలు వరద నీరుతో పొంగిపోర్లుతూ రహదారులన్నీ జలమయమవుతున్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో.. ప్రజల అల్లకల్లాం అవుతున్నారు. అయితే నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నేడు భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇప్పటికే ప్రస్తుతం నగరంలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాలు, వరదలు తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో తాజాగా GHMC అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నగరంలో నేడు కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాల తీవ్రత దృష్ట్యా GHMC అధికారులు ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. ఈ మేరకు నగరవాసులకు ఈ అలర్ట్ మెసేజ్ లను పంపిస్తున్నారు. ముఖ్యంగా భీభత్సమైన వర్షాల కారణంగా.. ప్రస్తుతం లోతట్టు ప్రాంతలైనా నాలాలు, చెరువులు వద్దకు ప్రజలకు వెళ్లొద్దని నగరవాసులకు అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏర్పడితే వెంటనే 040 21111111 లేదా 9000113667కు కాల్ చేయాలని సూచించారు. ఇక తమ ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి, సహాయసహకారాలు అందిస్తాయని పేర్కొన్నారు.
ఇకపోతే నేడు భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్య సంస్థలకు సర్కార్ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నేడు తెలంగాణ రాష్ట్రాంలోని 8 జిల్లాలకు ఐఎండీ భారీ వర్ష సూచన జారీ చేసింది. అందులో కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక మిగతా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.