Arjun Suravaram
Hyderabad Development: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది హైదరాబాద్. ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ సంస్థ కార్యలకపాలు సాగిస్తున్నాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ హైదరాబాద్ దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
Hyderabad Development: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది హైదరాబాద్. ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ సంస్థ కార్యలకపాలు సాగిస్తున్నాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ హైదరాబాద్ దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
Arjun Suravaram
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భాగ్యనగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి.. ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాక అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు,కంపెనీలు ఇక్కడ తమ కార్యకలపాలను సాగిస్తున్నాయి. ఇలా ప్రపంచ నగరాలతో హైదరాబాద్ నగరం పోటీ పడుతూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే నగరాన్ని మరింత అభివృద్ధి చేసి..ప్రపంచ పటంలోనే ప్రత్యేకంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర కమిషనర్ ఆమ్రపాలి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో నగరాన్నికి కొత్త రూపం రానుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమప్రాలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అలానే నగరంలోని వివిధ రకాల సమస్యల గురించి తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. అలానే నగరాన్ని మరింత గ్రీన్ గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన, నగర సుందరీకరణ, గార్డెనింగ్ తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నగరానికి కొత్త రూపు తీసుకొచ్చే అంశంపై హైదరాబాద్ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు.
భాగ్యనగర సుందరీకరణ, గార్డెనింగ్ పెంచడం వంటి వాటి కోసం మెరుగైన విధానాల రూపకల్పనపై ఆమె ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఓ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారితో కలిపి కమిటీని ఏర్పాటు చేశారు. నగరం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెరుగైన పద్ధతులను కనుగొనాలని కమిటీకి ఆమ్రపాలి దిశానిర్దేశం చేశారు. అదే కాకుండా హైదరాబాద్ నగర డెవలప్మెంట్ కోసం మరో రెండు కమిటీలను ఏర్పాటు చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, ఉపేందర్‌రెడ్డిలతో కలిపి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలోని ఆకర్షణీయ ప్రాంతాలను, ప్రాజెక్టులను గుర్తించి.. అదే విధానం నగరవ్యాప్తంగా అమలు చేయడానికి గల సాధ్యాసాధ్యాలతో ఒక రిపోర్టు ఇవ్వాలని కమిషనర్ వారికి సూచించారు.
అలానే జీహెచ్‌ఎంసీలో మహిళ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది సంక్షేమానికి, వారి రక్షణకు సంబంధించిన అంశాలపైనా కూడా స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని కమిషనర్ కమిటీని తెలిపారు. అదే విధంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల పార్కులు, నర్సరీలు, రోడ్ల ప్రధాన కూడళ్లు తదితర ప్రదేశాల్లో డెవలప్మెంట్ కి ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను సూచించాలని కమిషనర్..మరో కమిటిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా తాజాగా హైదరాబాద్ నగర కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో నగరం న్యూ లక్ లో కనిపించనుందని పలువు అభిప్రాయా పడుతున్నారు.