iDreamPost

HYDలో పిల్లల విక్రయానికి కోడ్ లాంగ్వేజ్.. స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి..

డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు వ్యక్తులు. అభంశుభం తెలియని పిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్నారు. హైదారాబాద్ లో కోడ్ లాంగ్వేజ్ తో పిల్లల విక్రయానికి తెరలేపింది ఓ ముఠా.

డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు వ్యక్తులు. అభంశుభం తెలియని పిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్నారు. హైదారాబాద్ లో కోడ్ లాంగ్వేజ్ తో పిల్లల విక్రయానికి తెరలేపింది ఓ ముఠా.

HYDలో పిల్లల విక్రయానికి కోడ్ లాంగ్వేజ్.. స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి..

సంతానం లేని వారు ఆస్పత్రులు, ఆలయాల చుట్టూ తిరిగి చివరికి పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. మరికొంత మంది పిల్లలను కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు. పిల్లలు లేని వారే టార్గెట్ గా చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తుంది ఓ ముఠా. ఈజీగా డబ్బు సంపాదించేందుకు పసిపిల్లలను తీసుకొచ్చి అంగట్లో వస్తువుల మాదిరిగా వెలకట్టి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో పిల్లల విక్రమ ముఠా గుట్టు రట్టయ్యింది. పిల్లలను అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ ముఠా పిల్లల విక్రయానికి ఉపయోగించిన కోడ్ తెలిస్తే షాకవ్వకుండా ఉండలేరు. స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి అనే కోడ్ తో పిల్లలను విక్రయిస్తున్నారు.

పిల్లలు లేని వారు ఆ ముఠాను సంప్రదించి స్కూటీ కావాలని అడిగి మూడు లక్షలు ఇస్తే ఆడపిల్లను పెంచుకోవడానికి ఏర్పాటు చేస్తారు. బైక్ కావాలని అడిగి ఐదు లక్షలు ఇస్తే మగపిల్లాడిని ఇచ్చేందుకు రెడీ అవుతారు. ఉత్తారాది రాష్ట్రాలైన ఢిల్లీ, పూణే నుంచి పిల్లలను తీసుకొచ్చి ఇరు తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని 11 మందిని రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 14 మంది పిల్లలను విక్రయించగా వారిని గుర్తించి హైదరాబాద్‌లోని శిశువిహార్‌కు తరలించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను కొన్న వారు తమ నుంచి పిల్లలను తీసుకెళ్లొద్దని కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే ఈ పిల్లల విక్రయానికి మూలకారకురాలు మహిళా ఆర్ఎంపీ డాక్టర్ అని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ శివారులోని పీర్జాదిగూడలో శోభారాణి అనే మహిళ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈమె పిల్లల విక్రయానికి పాల్పడుతున్నట్టు సమాచారం రావడంతో అక్షరజ్యోతి ఫౌండేషన్‌తోపాటు లోకల్ రిపోర్టర్ ఆమె వద్దకు వెళ్లారు. పాపను దత్తత తీసుకుంటామని నటించి అసలు గుట్టును బయటపెట్టారు. ఇప్పటి వరకు 50 మంది వరకు పిల్లలు విక్రయానికి గురైనట్టు సమాచారం ఉందని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. 1.80 లక్షల రూపాయల నుంచి 5.50 లక్షల రేటుకు పిల్లలను అమ్ముతున్నట్లు పోలీసు విచారణలో తేలిందని అన్నారు. అయితే పిల్లల అమ్మకానికి పాల్పడుతున్న వారిలో చదువుకున్న వారు, ఉద్యోగులు కూడా ఉండడం తీవ్ర కలకలంరేపుతోంది. పిల్లల విక్రయానికి పాల్పడుతున్న వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి