Arjun Suravaram
Arjun Suravaram
ఇటీవల కొంతకాలం నుంచి ప్రజాప్రతినిధుల ఎన్నికపై వచ్చిన కేసుల విషయంలో కోర్టు సంచలన తీర్పులు ఇస్తుంది. ఇటీవలే కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరావు ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఈ సారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ నియోకజవర్గం ఎమ్మెల్యేపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గద్వాల్ ఎమ్మెల్యే బి. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టు పేర్కొంది. ఆయన తరువాతి స్థానంలో ఉన్న మాజీ మంత్రి, డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ తీర్పుతో అరుణ అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.
2018 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి డీకే అరుణపై 28 వేల మెజార్టీతో గెలుపొందాడు. ఈ ఎన్నికల్లో ఆయనకు లక్ష పై చిలుకు ఓట్లు రాగా, కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డీకే అరుణ 71, 612 ఓట్లుతో రెండో స్థానంలో నిలిచింది. అయితే నామినేషన్ సమయంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంతకాలం విచారణ జరుగుతూ వచ్చిన ఈ కేసుపై తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. అదే సమయంలో తరువాతి స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.
కృష్ణమోహన్ రెడ్డి కి రూ.3 లక్షల జరిమానా విధించారు. అందులో నుంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశారు జారీ చేశారు. ఈ మధ్య తెలంగాణ హైకోర్టు వరుసబెట్టి అనర్హత పిటిషన్లపై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందుకు బలమైన కారణం ఒకటి ఉంది. అది ఏమిటంటే.. ప్రజాప్రతినిధుల అనర్హత కేసులన్నింటినీ ఈ నెలాఖరులోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుంత తెలంగాణలో కొప్పుల ఈశ్వర్ ,శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ కేసులతో పాటు పాతిక ఎమ్మెల్యేలు ఇలా అనర్హత వేసు కేసులు ఎదుర్కొంటున్నారు. మరి.. తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రాజయ్యకి MLA టికెట్ దక్కకపోవడం.. నాకు బాధ కలిగించింది: సర్పంచ్ నవ్య!