iDreamPost
android-app
ios-app

IAS Amrapali: అసలు ఎవరీ ఆమ్రపాలి? ఇంతమంది IASలలో ఈమెకే ఇంత క్రేజ్ దేనికి?

సినిమా సెలెబ్రిటీలకు, రాజకీయ నాయకులకు సాధారణంగా ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ, ఓ లేడీ ఐఏఎస్‌కు కూడా ఫ్యాన్స్‌ ఉన్నారంటే.. అది మామూలు విషయం కాదు..

సినిమా సెలెబ్రిటీలకు, రాజకీయ నాయకులకు సాధారణంగా ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ, ఓ లేడీ ఐఏఎస్‌కు కూడా ఫ్యాన్స్‌ ఉన్నారంటే.. అది మామూలు విషయం కాదు..

IAS Amrapali: అసలు ఎవరీ ఆమ్రపాలి? ఇంతమంది IASలలో ఈమెకే ఇంత క్రేజ్ దేనికి?

సాధారణంగా చాలా మందికి తమ జిల్లా కలెక్టర్‌ ఎవరూ కూడా తెలీదు. కానీ, ఆమ్రపాలి అన్న పేరు చెబితే మాత్రం.. ‘‘ ఓ ఆమె ఓ ఐఏఎస్‌’’ తెలంగాణలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు’’ అని ఇట్టే చెప్పేస్తారు. అంతలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన సమయంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేసి సెన్సేషనల్, డైనమిక్, ఇన్స్పైరింగ్, డేరింగ్ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. సోషల్‌ మీడియాలో సైతం పిచ్చ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు.

ఆమ్రపాలి తెలుగు బిడ్డే..

ఆమ్రపాలి అన్న పేరు వినగానే చాలా మందికి ఈమె నార్త్‌ ఇండియన్‌ అన్న ఆలోచన వస్తుంది. అయితే, ఆమ్రపాలి తెలుగు బిడ్డ. ఈమె తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. తండ్రి కాటా వెంకటరెడ్డి, తల్లి పద్మావతి ఎన్‌.అగ్రహారానికి చెందిన వారు. తర్వాత ఉద్యోగం నిమిత్తం విశాఖపట్నం వెళ్లారు. వెంకటరెడ్డి ఆంధ్రాయూనివర్శిటీలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. వెంకటరెడ్డి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరి పెద్ద కూతురు ఆమ్రపాలి. ఈమె 1982 నవంబర్‌ 4వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్‌ స్కూల్లోనే స్కూల్‌ విధ్యాభ్యాసం జరిగింది. తర్వాత ఆమె చెన్నై ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఐఐఎమ్‌ బెంగళూరునుంచి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేశారు.

 

చిన్న వయసులో ఐఏఎస్‌గా రికార్డు..

ఆమ్రపాలి పబ్లిక్‌ సర్వీసుల మీద ప్రేమతో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష రాశారు. అందులో ఆల్‌ ఇండియా 39వ ర్యాంకు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే ఐఏఎస్‌ అయి రికార్డు సృష్టించారు. ట్రైనింగ్‌ తర్వాత వికారాబాద్‌ జిల్లాకు సబ్‌కలెక్టర్‌ అయ్యారు. ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పని చేశారు. 2015లో రంగారెడ్డి జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గా పని చేశారు. 2016లో కొత్తగా జిల్లాలు ఏర్పడటంతో ఆమెకు పదోన్నతి లభించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. 2020లో ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆమ్రపాలి మళ్లీ తెలుగు నాటకు వచ్చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.

భర్త, చెల్లెలు కూడా ఆమ్రపాలిలాగే..

ఆమ్రపాలి 2018 ఫిబ్రవరి 18న పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త పేరు షమీర్‌ శర్మ. ఈయనది జమ్మూ పట్టణం. ఈయన 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందినవాడు. ప్రస్తుతం డామన్‌ డయ్యూ కేంద్రపాలిత ప్రాంత ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక, ఆమ్రపాలి చెల్లెలు గంగోత్రి ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కమ్‌టాక్స్‌ విభాగంలో పని చేస్తున్నారు. గంగోత్రి భర్త ఓ ఐపీఎస్‌. ఆయన పేరు ప్రవీణ్‌ కుమార్‌. తమిళనాడు వాసి. ప్రస్తుతం తమిళనాడు ఉమెన్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆమ్రపాలి క్రేజ్‌కు ఈ ఉదాహరణ చాలు..

ఆమ్రపాలి వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న రోజులు. ఆ సమయంలో ఆమ్రపాలికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఎంతలా అంటే.. గణేష్‌ నవరాత్రుల సందర్భంగా ఆమె విగ్రహాన్ని తయారు చేసి.. ఒడిలో బాలగణేష్‌ను ఉంచేంతలా. ఈ విగ్రహాన్ని వరంగల్ లో ప్రతిష్ఠించారు. పూజల అనంతరం నిమజ్జనం చేశారు. అయితే, ఐదేళ్లు తెలుగు నాడుకు దూరంగా ఉండటంతో ఆమ్రపాలి గురించి చర్చలు, న్యూస్‌లు బాగా తగ్గాయి. మళ్లీ ఆమె తన తెలుగు నాడుకు వచ్చేశారు. సోషల్‌ మీడియా ఊపందుకుంది. మీడియా సైతం ఆమెపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేసింది. మరి, ఆమ్రపాలి క్రేజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి