ఇది కదా అదృష్టమంటే.. ఆ ఇంట్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే.. ఎక్కడంటే?

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఓ కలలా మారుతున్న వేళ.. ఓ కుటుంబంలోని అందరు వ్యక్తులు గవర్నమెంట్ జాబ్స్ పొంది ఔరా అనిపిస్తున్నారు. ఆ ఇంట్లో అందరు ప్రభుత్వ ఉద్యోగులే.

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఓ కలలా మారుతున్న వేళ.. ఓ కుటుంబంలోని అందరు వ్యక్తులు గవర్నమెంట్ జాబ్స్ పొంది ఔరా అనిపిస్తున్నారు. ఆ ఇంట్లో అందరు ప్రభుత్వ ఉద్యోగులే.

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పోస్ట్ అయిన సరే గవర్నమెంట్ ఉద్యోగమే కావాలంటూ ప్రయత్నించే వారు వేలాది మంది ఉన్నారు. ప్రభుత్వ పోస్టులు వందల్లో ఉంటే పోటీ పడే వారి సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. మరి ఇలాంటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే మామూలు విషయం కాదు. కష్టపడి చదివినపుడు దానికి అదృష్టంతోడై ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఇక ఆ ఆనందానికి హద్దే ఉండదు. అయితే ఒక్క ఉద్యోగమే సాధించడం గగనమవుతున్న తరుణంలో ఓ కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు.

కడవేర్గు గ్రామానికి చెందిన గర్నెపెల్లి అంజయ్య యాదలక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వీరు కష్టాలను ఎదుర్కోని ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. ఇక తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆ పిల్లలు వారి కష్టం వృథా కాకుండా ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అంకితభావంతో చదివి ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. కొడుకులతో పాటు ఇద్దరు కోడళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఆ ఇంట్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ఇంటిల్లిపాది ప్రభుత్వ ఉద్యోగాలు పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కాగా గర్నెపెల్లి అంజయ్య యాదలక్ష్మి దంపతుల పెద్ద కొడుకు పెద్ద కొడుకు గర్నెపల్లి ప్రశాంత్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఇతను పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికై జగదేవపూర్‌ మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇక చిన్న కుమారుడు గర్నెపల్లి అనీల్‌కుమార్‌ సీఏ కోర్సు పూర్తి చేశాడు. ఇతను విద్యుత్‌శాఖలో అకౌంట్‌ ఆఫీ సర్‌గా ఉద్యోగం పొందాడు. అలాగే, కూతురు గర్నె పల్లి వనజ డీఈడీ పూర్తి చేసి 2018లో స్పెషల్‌ టీచర్‌గా ఎంపికైంది. ప్రశాంత్‌ భార్య గర్నెపల్లి దీక్ష నర్సింగ్‌ ఆఫీసర్‌ ఫలితాల్లో మూడవ జోన్‌లో 12 వ ర్యాంకు పొంది ఉద్యోగం సాధించారు. అనీల్‌కుమార్‌ భార్య గర్నెపల్లి ప్రత్యూష కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్లర్కు ఉద్యోగం సాధించారు. ఇలా ఒకే ఇంట్లోని ఐదుగురు వేర్వేరు శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంతో ఇది కదా అదృష్టమంటే అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments