iDreamPost
android-app
ios-app

HYD నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న ఫ్లైట్ లో మంటలు.. చివరకు

  • Published Jun 20, 2024 | 10:26 AM Updated Updated Jun 20, 2024 | 10:31 AM

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 130కిపైగా ప్రయాణికులు ఉన్నారు.

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 130కిపైగా ప్రయాణికులు ఉన్నారు.

HYD నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న ఫ్లైట్ లో మంటలు.. చివరకు

ఏటా విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య పెరిగిపోతున్నది. నిత్యం వేలాది మంది ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు. అయితే ఇటీవల జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గాల్లో ఉండగానే సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఇంజిన్ లో మంటలు చెలరేగడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. తాజాగా మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 130కిపైగా ప్రయాణికులు ఉన్నారు.

మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ అత్యవసర లాండింగ్‌కు అనుమతికోరారు. దీంతో ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ అధికారులు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. అయితే హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్​ వెళ్లాల్సిన ఫ్లైట్ కావడంతో ఫ్లైట్ లో భారీగా ఇంధనం నింపారు. ఈ కారణంతో ల్యాండింగ్‌ సమయంలో మంటలు చెలరేగుతాయని భావించిన అధికారులు దాదాపు 3 గంటల పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. సరిగ్గా 12:45కు టేకాఫ్​ అయిన ఫ్లైట్​ను 3:58 గంటలకు పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

దీంతో మలేషియా ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెను ముప్పు తప్పింది. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలను వెతికే పనిలో పడ్డారు అధికారులు. విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగడం వెంటనే పైలట్ అప్రమత్తమవ్వడం, ఆ విషయాన్ని ఏటీసీ అధికారులకు తెలియపరిచి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరాడు. సకాలంలో అధికారులు స్పందించి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టాలు చోటుచేసుకోలేదు.