P Venkatesh
కూతురు పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. ఏకంగా కాలుతున్న గడ్డివాములోకి తోసేసాడు. ఈ ఘోర ఘటన తెలంగాణలోని కామారెడ్డిలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?
కూతురు పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. ఏకంగా కాలుతున్న గడ్డివాములోకి తోసేసాడు. ఈ ఘోర ఘటన తెలంగాణలోని కామారెడ్డిలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?
P Venkatesh
పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు పరాయి వ్యక్తుల మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారుల పట్ల రాక్షసుల్లా విరుచుకుపడుతున్నారు. ఇదే కోవకు చెందిన ఓ కసాయి తండ్రి కన్నబిడ్డను మంటల్లోకి తోసేసాడు. విచక్షణ కోల్పోయిన అతను కాలుతున్న గడ్డివాములోకి ఏడేళ్ల వయసున్న తన కూతురుని విసిరేసాడు. ఇది తెలిసిన జనాలు అసలు వీడు కన్న తండ్రేనా అని చీదరించుకుంటున్నారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కన్న తండ్రే కూతరు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పొరుగింటి వ్యక్తి తనను దూషించాడనే కోపంతో రగిలిపోయి కుమార్తెను మంటల్లోకి విసిరేశాడు. మద్యం మత్తులో ఉన్న ఆ తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ బాలిక ప్రాణాలు నిలిచాయి. గాయాలైన ఆ చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన దేశాయిపేట్ సాయిలుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కాగా పెద్ద కుమార్తె అంకిత (7), చిన్న కుమార్తె మహిత. వీరిద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో వారి ఇంటి సమీప ప్రాంతంలో ఆడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి కొద్ది దూరంలోని గొట్టల గంగాధర్ అనే రైతుకు చెందిన గడ్డివాముకు నిప్పంటుకుంది.
ఆ సమయంలో ఇంట్లో లేని గడ్డివాము యజమాని ఘటన విషయం తెలిసి గంగాధర్ అక్కడికి పరుగున చేరుకున్నాడు. ఈ క్రమంలో గడ్డివాము దగ్థమవడానికి కారణం మీ కూతురు అంకిత అంటూ సాయిలుతో గొడవపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయిలు తనను గంగాధర్ దుర్భాషలాడాడనే కోపంతో రగిలిపోయాడు. దీనంతటికి కారణం కుమార్తె అంకితే అని ఆ బాలికను కాలుతున్న గడ్డి వాములోకి విసిరేశాడు. ఇది గమనించిన గంగాధర్ అప్రమత్తమై చిన్నారిని బయటకు తీసుకువచ్చాడు. ఈ ఘటనలో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమెను 108 వాహనంలో బాన్సువాడ ప్రాంతీయ దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం అంకిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరి కన్న తండ్రి కూతురును మంటల్లోకి తోసేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.