iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​లో మంటలు!

  • Author singhj Updated - 01:06 PM, Fri - 7 July 23
  • Author singhj Updated - 01:06 PM, Fri - 7 July 23
బ్రేకింగ్: ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​లో మంటలు!

రైలు ప్రమాద వార్తలు ప్రజల్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. ఇటీవల ఒడిషాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మహా విషాదంలో వందలాది మంది మృతి చెందగా.. వేలాది మంది గాయాలపాలయ్యారు. కోరమాండల్ ఎక్స్​ప్రెస్ ప్రమాదం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. కోరమాండల్ రైలు మెయిన్ ట్రాక్​లో నుంచి లూప్​ లైన్​లోకి వచ్చి.. అక్కడ అప్పటికే ఆడి ఉన్న గూడ్సును ఢీకొట్టడంతో దాని బోగీలు పట్టాలపై పడ్డాయి. అదే టైమ్​లో యశ్వంత్​పూర్-హౌరా ఎక్స్​ప్రెస్​ దూసుకొచ్చింది. బాలాసోర్​లో జరిగిన ఈ యాక్సిడెంట్​లో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం వల్ల వందలాది కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయి.

సిగ్నలింగ్ వైఫల్యం వల్లే ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని రైల్వే భద్రత కమిషనర్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సిగ్నలింగ్ లోపంతో పాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని సీఆర్​ఎస్​ నివేదిక తేల్చి చెప్పింది. రైల్వే బోర్డుకు ఈ మేరకు సీఆర్ఎస్​ ఒక రిపోర్టును సమర్పించింది. ఇదిలా ఉండగా.. తాజాగా తెలంగాణలోనూ ఒక రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఫలక్​నుమా సూపర్​ఫాస్ట్ ఎక్స్​ప్రెస్​ రైలులో శుక్రవారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఈ రైలును యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య నిలిపివేశారు.

రైలులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు రావడంతో ట్రైన్​లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ వెంటనే దిగిపోయారు. సమయానికి మంటలు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. దట్టంగా వ్యాపించిన మంటల్ని ఫైరింజన్లు ఆర్పివేస్తున్నాయి. మంటల కారణంగా ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​కు చెందిన నాలుగు బోగీలు దగ్ధమయ్యాయి. ఫలక్​నుమా రైలులో 1,500 మంది ప్రయాణికులు ఉన్నారని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఫలక్​నుమా సూపర్​ఫాస్ట్ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగిన ఘటనపై రైల్వే శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి