P Krishna
Selling counterfeit products : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అసలు ఏదో నకిలీ ఏదో తెలియని పరిస్థితి నెలకొంటుంది. కొంతమంది కేటుగాళ్లు నిత్య సరుకులు ప్రతీదీ డూప్లికేట్ చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు.
Selling counterfeit products : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అసలు ఏదో నకిలీ ఏదో తెలియని పరిస్థితి నెలకొంటుంది. కొంతమంది కేటుగాళ్లు నిత్య సరుకులు ప్రతీదీ డూప్లికేట్ చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు.
P Krishna
డబ్బు సంపాదించడమే పరమావధిగా కొంతమంది కేటుగాళ్లు ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. తమ స్వార్థం కోసం పాల నుంచి తినే ప్రతి వస్తువు, ఇంట్లో వాడే ప్రతి ప్రొడక్ట్ కల్తీ చేస్తూ కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. అమాయ ప్రజలు ఏది నకిలీనో.. ఎది అసలో గుర్తంచలేకపోతున్నారు. ప్రముఖ కంపెనీల బ్రాండ్ పేర్లతో టీ పొడి, సర్ఫ్ పౌడ్, సబ్బులు, నూనె డబ్బాలు ఇతర ప్రాడక్టులు ప్యాక్ చేసి అమ్ముతున్న ఓ ముటా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. వారి వద్ద ఉన్న ప్రొడెక్టలు చూసి ఆశ్చర్యపోయారు. గుట్టు చప్పుడు కాకుండా కిరాణా షాపులకు తరలిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
నగరంలో మార్కెట్లలో లభిస్తున్న నిత్యావసర సరకులు అసలు ఏవో.. నకిలీ ఏదో తెలియని పరిస్థితి నెలకొంది. కొంతమంది కేటుగాళ్లు బ్రాండెడ్ కంపెనీ లోగోలు, స్ట్రిక్కర్లతో నకిలీ వస్తువులు తయారు చేసి మార్కెట్ లోకి విక్రయిస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. అదే బ్రాండ్ వస్తువుగా భావించి కొనుగోలుదారులు కొంటున్నారు.. అనారోగ్యం పాలవుతున్నారు. నకిలీ వస్తువులతో జనాల జీవితాలతో ఆడుకుంటున్న కేటుగాళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఘరానా ముఠా సాగిస్తున్న దందా గుట్టు రట్టు చేశారు. ఆరుగురు ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి సర్ఫ్ పౌడర్, కల్తీ నూనె, సబ్బులు, హార్పిక్, లైజాల్ లిక్విడ్ దాదాపు రూ.2 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎస్. రష్మి పెరుమాళ్ తెలిపారు. నాసి రకం ప్రొడక్ట్స్ తో ప్యాక్ చేసి హూల్ సేల్, రిటైల్ గా మార్కెట్ లోకి చేరవేస్తున్నారని అన్నారు.
రాజస్థాన్ కి చెందిన శ్యామ్ బాటీ, కమల్ బాటీ జీవనోపాది కోసం నగరరాకి వలస వచ్చి కాచీ గూడ ప్రాంతంలో స్థిరపడ్డారు. వచ్చిన కొత్తలో ఇద్దరూ కిరాణా షాపులు నిర్వహించారు. అలా వస్తువులు తీసుకురావడం.. అమ్మడం చేస్తూ కొన్ని ప్రొడక్ట్స్ జనాలకు ఎంత అవసరం అనేదాని గురించి బాగా తెలుసుకున్నారు. అలాంటి వస్తువులు నకిలీ చేసి అమ్మినా జనాలు తీసుకుంటున్నారన్న విషయం బాగా గ్రహించారు. అలా బ్రాండెడ్ వస్తువుల పేరుతో నాసిరకం వస్తువులను ప్యాకింగ్ చేస్తూ విక్రయించడం మొదలు పెట్టారు. వీరితో బేగంబజారుకు చెందిన జయరామ్ కలిశాడు. ముగ్గురూ నగరంలోని పలు కిరాణా షాపులను ఎంచుకొని వాటికి నాసిరకం ప్రొడక్ట్స్ అమ్మి క్యాష్ చేసుకోవడం మొదలు పెట్టారు.
బ్రాండెడ్ కవర్లలో ముడిసరుకును ప్యాక్ చేసేందుకు కాటేదాన్ వద్ద ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. దీన్ని మహేందర్ సింగ్ అనే వ్యక్తి నడిపించేవాడు. అలా 2019 నుంచి 2022 వరకు కాచిగూడ, మైలార్ దేవరపల్లి, నల్లగొండలో తమ వ్యాపారాలు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వారిపై ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. ప్రధాన నింధితుడు మహేందర్ సింగ్ ని శుక్రవారం కాజీ గుడాలో అదుపులోకి తీసుకున్నారు. నాగారం, కాటేదాన్ గోదాలములపై దాడులు చేశారు పోలీసులు. గోదాముల్లో పనిచేస్తున్న మిథలేష్ కుమార్, త్రియామ్ కుమార్ లను అరెస్టు చేశారు. శ్యామ్ భాటీ, కమల్ భాటీ, జయరామ్ లో పరారీలో ఉన్నారని.. తర్వలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు అధికారు.