Dharani
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశాడు. 6 నెలల్లో తెలంగాణలో మళ్లీ కేసీఆర్ వస్తాడంటూ జోస్యం చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశాడు. 6 నెలల్లో తెలంగాణలో మళ్లీ కేసీఆర్ వస్తాడంటూ జోస్యం చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..
Dharani
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం జోరుగా సాగుతుంది. ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ అయిపోగా.. మే 13న నాలుగో దశ పోలింగ్ జరగనుంది. సోమవారం నాడు జరిగే ఈ పోలింగ్‌లో ఏపీ, తెలంగాణలో ఓటింగ్ నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా పాలన సాగిస్తున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఓడిపోయిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీకి 10-12 సీట్లు ఇస్తే.. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ హవా కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో తెలంగాణలో మళ్లీ కేసీఆర్ వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని మోసం చేశారని, ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా రేవంత్ డేట్లు మారుస్తున్నాడంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గురువారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో మాకు 10-12 సీట్లు మాకు ఇవ్వండి. ఆరు నెలల్లో రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ వస్తారు.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారు’’ అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నమో అంటే నమ్మించి మోసం చేసేటోడు అని ప్రధాని నరేంద్ర మోదీని అభివర్ణించారు. 2 కోట్ల మంది కి ఉద్యోగాలు ఇస్తాను అన్నారు… ఇచ్చారా.. రైతుల ఆదాయం డబల్ అయిందా అని ప్రశ్నించారు.
అంతేకాకుండా.. ‘‘జన బలం ఉంటే ఎవ్వరు ఎం చేయలేరు. రేవంత్ పాలన పిచ్చొడి చేతిలో రాయిలా మారింది. మహిళల కోసం ఫ్రీ బస్సు పథకం పెట్టారు. ఇప్పుడు 40 మంది ఎక్కే బస్సులో 60 మంది ని కూర్చో బెట్టారుతున్నారు. జేబు దొంగలు ఎక్కువ అయ్యారు. జేబుల కత్తెర పెట్టుకొని రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. పిచ్చొల్ల చేతిలో రాష్ట్రం ఉంది. పదేళ్ల క్రితం మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు 150 హామీలు ఇచ్చారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ మోడీ..? మేకిన్ ఇండియా లేదు.. వికసిత్ భారత్ కాలేదు.. కానీ విఫల్ భారత్ ఐంది. కరీంనగరోళ్లకు 15 లక్షల నల్లధనం మీ ఖాతాల్లో పడ్డయా.. బండి సంజయ్ తెచ్చి ఇచ్చిండట కదా.. ప్రధానిది ఎమోషనల్ బ్లాక్ మెయిల్. మోదీ హయాంలో రూపాయి విలువ పడిపోయింది. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్నాడు. కార్పోరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేశాడు తప్ప.. సామాన్యులకు న్యాయం చేయలేదు’’ అంటూ దుయ్యబట్టారు కేటీఆర్.