ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. MLC కవిత ఇంట్లో ED,IT తనిఖీలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎంఎల్సీ కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిస్తున్నారు. గతంలో నోటీసులు ఇచ్చిన అధికారులు తాజాగా కవిత ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎంఎల్సీ కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిస్తున్నారు. గతంలో నోటీసులు ఇచ్చిన అధికారులు తాజాగా కవిత ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎంఎల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ కేసులో ఆమెకు నోటీసులు ఇచ్చిన ఈడీ ఇప్పుడు సోదాలకు దిగింది. లిక్కర్ స్కాం కేసులో ఎంఎల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 ఈడీ అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ సోదాలు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది.

కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ అధికారుల ఆరాతీస్తున్నారు. ఈడీ అధికారులతో కలిసి ఐటీ శాఖ అధికారులు కూడా సోదా చేస్తున్నారు. లిక్కర్ స్కాం నిందితులతో ఆమె లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె అకౌంట్లను తనఖీ చేస్తున్నట్లు సమాచారం. ఈ స్కాంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే.. ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి తనపై చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో కవిత పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయ స్థానం కవిత పిటీషన్ పై విచారణ వాయిదా వేసింది. ఈ నెల 19కి సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎంఎల్సీ కవిత ఇంట్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ ఆమె రెండు ఫోన్లను సీజ్ చేశారు. చేస్తున్న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలక పాత్ర పోషించినట్లు, ఈ పాలసీలో కవితకు సుమారు 100 కోట్లు అందినట్లు ఆరోపణలు వచ్చాయి. త్వరలో లోక్ సభ ఎలక్షన్స్ జరుగనున్న వేళ ఎంఎల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.

Show comments