P Krishna
Wine Shops Closed in Telangana: తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఈ క్రమంలో మందు బాబులకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది.
Wine Shops Closed in Telangana: తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఈ క్రమంలో మందు బాబులకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది.
P Krishna
దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఈసారి ఎన్నికలు అన్ని పార్టీల అధినేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మద్యం, బంగారం, వెండి, ఇతర ఖరీదైన కానుకలు ఇస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు కొంతమంది నేతలు. నేటితో తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు 10 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఈసీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి.. మందు బాబులు హాయిగా కూల్ బీర్ తో చిల్ అవ్వాలని అనుకుంటున్న వేళ ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో రెండు రోజులు లిక్కర్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించింది. తెలంగాణలో మే 13 న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం షాపులు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే మే 13 కి ముందు నుంచే షాపులు వైన్ షాపులు బంద్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం షాపులతో పాటు కల్లు కంపౌండ్లు, బార్లు సైతం మూసివేయాలని ఆదేశించింది.
మే 11వ తేదీన శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు బంద్ చేయనున్నారు. తిరిగి మే 13వ తేదీ.. పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత షాపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రం ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించిన మద్యం షాపులు, కల్లు దుఖానాలు, బార్ ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఓట్ల కౌంటింగ్ రోజు జూన్ 4 న కూడా మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసినా.. అమ్ముతున్నా సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.