iDreamPost
android-app
ios-app

HYD ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక అక్కడ ట్రాఫిక్ కష్టాలకి చెక్!

హైదరాబాద్ అంటే బిర్యానీతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా ఉంటాయి. ఈ చివరి నుండి ఆ చివరకు ప్రయాణించాలంటే పట్టపగలే చుక్కలు కనబడతాయి. అయితే ఈ ట్రాఫిక్ కష్టాలను కొంత మేర తీర్చింది మెట్రో రైలు. అయితే నగరవాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్.

హైదరాబాద్ అంటే బిర్యానీతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా ఉంటాయి. ఈ చివరి నుండి ఆ చివరకు ప్రయాణించాలంటే పట్టపగలే చుక్కలు కనబడతాయి. అయితే ఈ ట్రాఫిక్ కష్టాలను కొంత మేర తీర్చింది మెట్రో రైలు. అయితే నగరవాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్.

HYD ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక అక్కడ  ట్రాఫిక్ కష్టాలకి చెక్!

హైదరాబాద్ మహా నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. ఎడ్యుకేషన్, జాబ్, వ్యాపారం, ఇతర పనుల నిమిత్తం వివిధ రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరిలో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రద్దీ నెలకొన్న సంగతి విదితమే. దీంతో ఎక్కడకు ప్రయాణించాలన్నా గంటల గంటల సమయం పడుతుంది. భారీ ట్రాఫిక్ నెలకొంటుంది. గమ్య స్థానాలకు చేరుకోవాలంటే వ్యయ ప్రయాసలు పడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్స్, అండర్ పాస్ వంటి నిర్మాణాలు చేపడుతోంది. అలాగే నగర వాసుల కష్టాలను తీరుస్తూ మెట్రో వంటి సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అయితే ఎల్బీ నగర్-మియాపూర్, అలాగే నాగోల్-రాయదుర్గ్ వంటి మూడు లైన్ల మెట్రో లైన్ తీసుకువచ్చింది. అయినప్పటికీ రద్దీ నెలకొంటుంది.

ఈ క్రమంలో నగర సరిహద్దుల వరకు మెట్రో విస్తరించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను హైదరాబాద్ శివారు ప్రాంతాలైన హయత్ నగర్, శంషాబాద్, బీహెచ్ఈఎల్, పటాన్ చెరు వరకు విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. అలాగే నాగోల్-ఎల్బీనగర్ మధ్య స్కై వాక్ ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉంది సర్కార్. ఈ నేపథ్యంలో బేగంపేటలోని మెట్రో రైలు భవన్ లో హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం, డీపీఆర్ న్సల్టెన్సీ ఇంజినీరింగ్‌ నిపుణులతో ఎన్‌హెచ్‌ (NH) అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో మెట్రో ప్రాజెక్ట్, ఫ్లైఓవర్లకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్బీనగర్ సమీపంలోని చింతల కుంట ప్రాంతం నుండి హయత్ నగర్ వరకు కొత్తగా మెట్రో రైలు ఎలైన్ మెంట్ ఖరారు కాబోతుంది.

ఇప్పటికే ఈ ప్రాంతంలో కొత్తగా ఫ్లై ఓవర్ల నిర్మాణం జరుగుతుండగా.. వాటి పక్క నుండే మెట్రో రైలు మార్గం నిర్మించాలని యోచిస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య తగ్గి.. త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్- విజయవాడ రూట్‌లో వాహనాల రద్దీ తగ్గి.. సవ్యంగా రాకపోకలు సాగిపోతుంటాయి.  ప్రస్తుతం బీహెచ్ఈఎల్ ప్రాంతానికి మెట్రో విస్తరించాలన్న యోచనలో భాగంగా ఫ్లై ఓవర్ పక్క నుండి మెట్రో రైలు మార్గాన్ని అధికారులు ప్రతిపాదించారు. అయితే గంగారం వద్ద మాత్రం డుబల్ డెక్ ఫ్లై ఓవర్ నిర్మించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పై నుండి మెట్రో ట్రైన్, కింద ఫ్లై ఓవర్‌లో వాహన రాకపోకలు సాగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది నిర్మాణమైతే ఇక్కడ ట్రాఫిక్ ష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు రెండు మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి