iDreamPost
android-app
ios-app

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

  • Published Feb 07, 2024 | 10:30 AM Updated Updated Feb 07, 2024 | 10:30 AM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను అందించనుంది. దీనికి సంబంధించిన విధివిదానాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను అందించనుంది. దీనికి సంబంధించిన విధివిదానాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు గ్యారెంటీల అమలుకు ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు మహాలక్ష్మీ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచింది. ఇక మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. అందులో ఒకటి గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందించేందుకు రెడీ అవుతోంది. రూ. 500 కే గ్యాస్ ఇచ్చేందకు కూడా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం పేదలకందే వైద్యంపై దృష్టిసారించింది. ప్రతిఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం డిజిటల్ హెల్త్ కార్డులను ఇవ్వాలని సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వైద్యారాగ్య శాఖ దీనిపై కసరత్తు ప్రారంభించనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డులను అందజేయడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.

డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యల సమాచారం అంతా నిక్షిప్తంకానుంది. హెల్త్ కార్డుల్లో వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు, గతంలో తీసుకున్న చికిత్సకు సంబంధించిన వివరాలను పొందుపర్చనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు వెంటనే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య విషయాలు తెలియడంతో సత్వరమే మెరుగైన చికిత్స, వైద్యసేవలకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అదే విధంగా ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం, వైద్య సదుపాయాలు అందరికీ అందేలా చేయడం, ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. ఈ కార్డును ఆరోగ్యశ్రీ, ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. డిజిటల్ హెల్త్ కార్డులల్లో పొందుపరచాల్సిన అంశాలపై అధికారులు కసర్తు ప్రారంభించారు. త్వరలోనే హెల్త్ కార్డులను అందించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి