4 లక్షల లంచం తీసుకుంటూ.. ACBకి పట్టుబడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

అవినీతికి పాల్పడే అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఏసీబీ అధికారులు. తాజాగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

అవినీతికి పాల్పడే అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఏసీబీ అధికారులు. తాజాగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

ప్రభుత్వ కార్యాలయాల్లో చేతులు తడపనిదే పని జరగని పరిస్థితులు తలెత్తాయి. అవినీతి అధికారుల పట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ లంచాలు తీసుకోవడం మాత్రం మానడం లేదు. లంచం తీసుకోవడం నేరమని తెలిసి కూడా లంచాలు తీసుకుంటూ తమ బుద్దిన చాటుకుంటున్నారు కొందరు ప్రభుత్వ అధికారులు. తాజాగా మరో ప్రభుత్వ అధికారి భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం అనుమతి కోసం నో అబ్జక్షన్ సర్టిఫికెట్ అవసరం కాగా దీని కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశాడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ యాతా పవన్ కుమార్‌.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ భగాయత్ విలేజీలోని శాంతి నగర్‌లో బిల్డర్ గోపగాని రమణమూర్తి వాణిజ్య భవనం నిర్మాణం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నిర్మాణం కోసం ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్’ తీసుకునేందుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాతా పవన్ కుమార్ ను సంప్రదించాడు. ఎన్వోసీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డిమాండ్ చేశాడు. ఈ విషయమై గోపగాని రమణమూర్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో రూ.5 లక్షల లంచం అడిగిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ యాతా పవన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు గోపగాని రమణమూర్తి నుంచి యాతా పవన్ కుమార్ తీసుకున్న రూ.4 లక్షల నగదును జప్తు చేశారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అదుపులోకి తీసుకుని ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.

Show comments