తెలంగాణ మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్!

Deputy CM Mallu Bhatti Vikramarka:తెలంగాణ లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ వెళ్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే.

Deputy CM Mallu Bhatti Vikramarka:తెలంగాణ లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ వెళ్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఆరు గ్యారెంటీ పథకాల పై తొలి సంతకం చేశారు. కొద్దిరోజుల్లోనే మహాలక్ష్మి పథకం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రూ.500 లకే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, త్వరలో అర్హులైన మహిళలకు రూ.2500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తాజాగా మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని ఆయన అన్నారు. త్వరలో రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియెజకవర్గానికి 3500 ఇళ్లకు భూమి పూజ చేస్తామన్నారు.

గత పాలనలో అప్పులు చేసి గొప్పలు చెప్పుకున్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరేరుస్తూ వస్తుంది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశాం. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. మహిళా సంక్షేమానికి వివిధ పథకాలు అమల్లోకి తీసుకువస్తాం. ప్రజలు తమ పార్టీని నమ్మి అధికారం కట్టబెట్టారు.. వారి సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు.

 

Show comments